జేఈఈ మెయిన్ ఫలితాల్లో రెసోనెన్స్ ప్రభంజనం
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:11 AM
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెసోనెన్స్ విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ప్రభంజనం సృష్టించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెసోనెన్స్ విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ప్రభంజనం సృష్టించారు. సంస్థ రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 94 మంది విద్యార్థులు 99 పైగా పర్సంటైల్ సాధించి తమ ప్రతిభను నిరూపించారు. అదనంగా 850 మందికి పైగా విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 99 పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఐఐటీ-జేఈఈ శిక్షణలో రెసోనెన్స్ అగ్రగామి సంస్థగా ఈ ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయి. ముఖ్యమైన ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన రెసోనెన్స్ విద్యార్థుల్లో అభినవ్ చిట్టోరి (12), ఆదిత్యరెడ్డి (147), అన్వితరెడ్డి (155), సమృద్ధి భట్టాచార్య (242), రేవంత్ వంగాల (365), స్నిథిక (476) ఉన్నారు. కాగా సాకేత్‌రెడ్డి ఫిజిక్స్‌లో 100 పర్సంటైల్ సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఫలితాలు రెసోనెన్స్ సంస్థలోని నాణ్యమైన బోధన, సమగ్ర అధ్యయన విధానం, విద్యార్థుల కృషికి నిదర్శనంగా నిలిచాయి.