Share News

సత్తా చాటిన ‘రెసోనెన్స్‌’ విద్యార్థులు

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:42 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి సత్తా చాటారని రెసోనెన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ తెలిపింది.

సత్తా చాటిన ‘రెసోనెన్స్‌’ విద్యార్థులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి సత్తా చాటారని రెసోనెన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ తెలిపింది. ఫస్టియిర్‌ ఎంపీసీలో 17మంది విద్యార్థులు 468 మార్కులు సాధించారని, బైపీసీలో 8 మంది విద్యార్థులు 437 మార్కులు సాధించారని వెల్లడించింది. సెకండియర్‌ ఎంపీసీలో తమ విద్యార్థి రేవంత్‌ వంగల 994, బైపీసీలో షేక్‌ ఐరా జాసియా 995 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్లుగా నిలిచి సత్తా చాటారని రెసోనెన్స్‌ హైదరాబాద్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు నర్రా ప్రకటించారు. తమ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. అత్యంత ప్రతిభ కనబరచిన విద్యార్థులను హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అభినందించారు.

Updated Date - Apr 13 , 2026 | 05:43 AM