Share News

రెవెన్యూగ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:17 PM

జిల్లాలో భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారానికి వెసలుబాటు కలుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

 రెవెన్యూగ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారం
కిష్టంపేటలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారానికి వెసలుబాటు కలుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండ లంలోని కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ భారతి రెవె న్యూ సదస్సుల్లో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రికార్డు లు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగనలోకి తీసుకుని ప్ర భుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మొదటగా గ్రామం లోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారిస్తామని, తద్వారా గ్రామానికి సం బంధించిన భూమిస్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూముల సైతం నిర్ధారణ అవు తాయన్నారు. భూసర్వే సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్‌ చేస్తామన్నారు. ఈ క్రమంలో సమస్యలు తలెత్తితే న్యాయపరమైన చర్యలకు సులభతరం అవుతుం దన్నారు. మ్యాపింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమ న్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు తగదులు, భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వంటశా లలో భోజనాన్ని పరిశీలించి వంట సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీడీవో మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:18 PM