kumaram bheem asifabad- రాజీమార్గంలో కేసుల పరిష్కారం
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:21 PM
లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో కేసులు పరిష్కరిస్తున్నామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సంకేత్‌మిత్ర అన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో శనివారం న్యాయ సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సంకేత్‌మిత్ర, జూనియర్ సివిల్ జడ్జి అఆనంతలక్ష్మి ముఖ్య ఆతిథిలుగా హాజరయ్యారు.
జైనూర్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో కేసులు పరిష్కరిస్తున్నామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సంకేత్‌మిత్ర అన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో శనివారం న్యాయ సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సంకేత్‌మిత్ర, జూనియర్ సివిల్ జడ్జి అఆనంతలక్ష్మి ముఖ్య ఆతిథిలుగా హాజరయ్యారు. సీనియర్ సివిల్ జడ్జి సంకేంత్‌మిత్ర మాట్లాడుతూ నిరుపేదలకు ఎలాంటి న్యాయ ఖర్చులు లేకుండా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మహిళలు లోక్ అదాలత్‌లు, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక స్థోమత లేని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుపేదలు, వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉన్న అర్హులైన వారికి పూర్తిగా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు సమర్థవంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మాదక ద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని కోరారు. అంతకు ముందు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి గృహ హింస చట్టంపై మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎల్‌ఎడీసీఎస్ అంజనాదేవి, సీఐ రమేశ్, సర్పంచ్ కొడప ప్రకాష్, సమాఖ్య అఽధ్యక్షురాలు కొడప మోతుబాయి, ఈవో కోరేంగ ఆనంద్‌రావ్, ఐకేపీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.