Share News

మునిసిపల్‌ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:34 PM

మునిసిపల్‌ ఎన్ని కల నేపథ్యంలో జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి ము నిసిపల్‌ వార్డుల రిజర్వేషన్లు ఖరా రు చేసినట్లు కలెక్టర్‌ బదాత్‌ సంతో ష్‌ తెలిపారు.

మునిసిపల్‌ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదాత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్ని కల నేపథ్యంలో జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి ము నిసిపల్‌ వార్డుల రిజర్వేషన్లు ఖరా రు చేసినట్లు కలెక్టర్‌ బదాత్‌ సంతో ష్‌ తెలిపారు. శనివారం నాగర్‌క ర్నూల్‌ సమీకృత జిల్లా కార్యాల యాల భవన సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్‌ దేవసహాయం తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని మునిసిపల్‌ వార్డుల వారీగా రిజర్వేషన్‌ కేటాయింపు ప్రక్రి య నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జి ల్లాలోని నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పరిధిలో 24వార్డులు, కల్వకుర్తి మునిసిపల్‌ పరిధిలో 22, కొల్లాపూర్‌ మునిసిపల్‌ పరిధిలో 19వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనకడిన తరగతులు, జనరల్‌ మహిళ, జనరల్‌ స్థానా లకు రిజర్వే షన్లు కేటాయించినట్లు తెలిపారు. రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరి గిందని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 11:34 PM