kumaram bheem asifabad- రిజర్వేషన్ల టెన్షన్
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:06 PM
మున్సిపల్ ఎన్నికలపై ఆశతో ఉన్న వారికి రిజర్వే షన్ల దడ పట్టుకుంది. ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా చూసి ఆశావహులు ఖంగుతిన్నారు. తాము ఎన్నికల బరిలో నిలవాల నుకున్న వార్డుల్లో ఇతర వార్డుల ఓటర్లు చేరడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనని తలలు పట్టుకుంటున్నారు. వార్డుల రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
- రెండు మున్సిపాలిటీల్లో 65,132 మంది ఓటర్లు
- ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో తుది ఓటరు జాబితా వెల్లడి
- రెండు చోట్ల మహిళలే అధికం
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలపై ఆశతో ఉన్న వారికి రిజర్వే షన్ల దడ పట్టుకుంది. ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా చూసి ఆశావహులు ఖంగుతిన్నారు. తాము ఎన్నికల బరిలో నిలవాల నుకున్న వార్డుల్లో ఇతర వార్డుల ఓటర్లు చేరడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనని తలలు పట్టుకుంటున్నారు. వార్డుల రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. 16వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో ఆ తర్వాత రిజర్వేషన్ల ఖరారుపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించనున్నారు.
- కౌన్సిలర్, చైర్మన్ పదవులపై..
కౌన్సిలర్, చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి తమకు అనుకూలంగా రిజర్వేషన్ కలిసి వస్తుందా లేదా అనే బెంగ పట్టుకుంది. జిల్లాలో రెండు మున్సిపాలిటీల పరిధిలో 50 వార్డులు ఉన్నా యి. ఆసిఫాబాద్‌లో 20 వార్డులు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు ఉన్నాయి. ఈసారి ఎన్నికల బరిలోకి దిగాలని ఆశిస్తున్న ఆశావహులు తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. తమవార్డులోనే తమకు పోతిటీచేసే అవకాశం లభిస్తుందా, లేక ఇతర వార్డులు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయే అనేది తెలియక అయోమయంలో పడ్డారు. బరిలో నిలువాలను కున్న కొందరు కొంత కాలంగా తాము పోటీచే యాలని ఆశిస్తున్న వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తేలిన ఓటర్ల లెక్క..
మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది ప్రచురించారు. ఇది వరకు ప్రకటించిన ముసాయి దా ఓటరు జాబితాలో పలు తప్పులు దొర్లడంతో ఆయా రాజకీయ పార్టీలు కమిషనర్ దృష్టికి తీసుకు వచ్చారు. మున్సిపల్ పరిధిలో 20 వార్డుల్లో 13,927 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ లు 7,103 మంది, పురుషులు 6,822 మంది ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఈనెల 2 నుంచి 9 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఈ మేరకు 108 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన అభ్యంత రాలను ఈనెల 9,10 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వివ రాలను సేకరించి తప్పు ఒప్పులను సవరించారు. ఈనెల 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను ప్రచురించనున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు ఓటరు తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డుల పరిధిలో మొత్తం ఓటర్లు 51,205 ఉన్నారు. మహిళలు 26,193, పురుషులు 25,004, ఇతరులు 8ఉన్నట్టు వివరించారు. పురుషులకంటే మహిళ ఓటర్లు 1,183 అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
- రోటేషన్ పద్ధతిలో..
మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్‌గా ఖరారు చేయనున్నారు. వార్డుల రిజర్వే షన్లు వార్డు ఓటర్ల సంఖ్య ఆధారంగా ప్రకటించను న్నారు. సామాజిక వర్గాల జనాభా ఆదారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా బీసీల కు మాత్రం ఓటర్ల సంఖ్య ఆదారంగా నిర్ధారించను న్నారు. వార్డుల్లో సగం స్థానాలు అన్ని సామాజిక వర్గాల మహిళలకు రిజర్వు కానున్నాయి. రోటేషన్ పద్ధతిలోనే వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయను న్నట్లు సమాచారం. ఎస్టీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వార్డులు, చైర్మన్ స్థానాలను కేటాయించి రిజర్వే షన్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలిన స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను మున్సిపల్‌శాఖ డైరెక్టర్ ఖరారు చేయనుంది. వార్డు స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్ ప్రకటిస్తారు.
- రాజకీయ పార్టీల్లో సందడి..
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ప్రకటన వెలువడగానే రాజ కీయ పార్టీల్లో సందడి ప్రారంభమైంది. ఏ నలుగరు కలిసినా మున్సిపల్ ఎన్నికలపైనే చర్చ జరుగు తోంది. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఇతర పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోను న్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్‌ఎస్, బీజేపీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్ని కల్లో సైతం తమ సత్త చాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఏ వార్డులో ఏ వర్గానికి రిజర్వు అయితే ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో పార్టీల్లో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి.