Share News

Nilgiri Corporation? : నీలగిరి కార్పొరేషన్‌లో రిజర్వేషన్లు మార్పు?

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:40 AM

నీలగిరి కార్పొరేషన్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు మారడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు రిజర్వేషన్ల మార్పు విషయంలో ఎలాంటి తేడాలు ఉండవని అనుకున్న వారికి ఇది చేదు వార్తే. పాత రిజర్వేషన్లే ఉంటాయనే ధీమాతో ఉన్న కొంతమంది నాయకులు ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను, వారికి అనుకూలంగా ఉం డేవారెందరో లెక్కలేసుకుంటున్నారు.

Nilgiri Corporation? : నీలగిరి కార్పొరేషన్‌లో రిజర్వేషన్లు మార్పు?

ఎదురుచూస్తున్న ఆశావహులు

ఓటర్‌ తుది జాబితా విడుదలకు తాత్కలిక బ్రేక్‌

రామగిరి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నీలగిరి కార్పొరేషన్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు మారడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు రిజర్వేషన్ల మార్పు విషయంలో ఎలాంటి తేడాలు ఉండవని అనుకున్న వారికి ఇది చేదు వార్తే. పాత రిజర్వేషన్లే ఉంటాయనే ధీమాతో ఉన్న కొంతమంది నాయకులు ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను, వారికి అనుకూలంగా ఉం డేవారెందరో లెక్కలేసుకుంటున్నారు. టికెట్‌ కోసం ఆయా పార్టీల అధినేతల వద్ద పైరవీ లు సైతం సాగిస్తున్నారు. మరికొంతమంది టికెట్‌ వారికి దక్కుతుందనే ఆలోచనతో వార్డుల్లో హడావుడి చేస్తూ ఓటర్లను ఆకర్శించే పనిలో ఉన్నారు. అయితే కార్పొరేషన్‌ ఏర్పాటుతో పరిణామాలు మారాయని అధికారులు అనధికారికంగా పేర్కొంటున్నారు.

తుది జాబితా విడుదలకు బ్రేక్‌

ఓటర్ల ముసాయిదా జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత 10వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే రిజర్వేషన్ల విషయంలో మార్పు జరిగే అవకాశాలు ఉన్నందున తుది జాబితా విడుదలకు బ్రేక్‌ పడింది. తుది జాబితా ఎప్పుడనేది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేగానీ విడుదల చేసే అవకాశం లేదని ఓ అధికారి తెలిపారు. 10న తుది జాబితాను విడుదల చేస్తే న్యాయపర చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని భావించిన మునిసిపల్‌ ఉన్నతాధికారులు దీన్ని తాత్కలికంగా నిలిపివేయాల్సిందిగా మునిసిపల్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలను చూస్తే రిజర్వేషన్లు మారడం ఖాయమని తెలుస్తోంది.

రిజర్వేషన్లపై సోషల్‌ మీడియాలో పోస్టులు

ఇదిలా ఉండగా మునిసిపల్‌ అధికారులు విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా ఆధారంగానో లేక నాయకుల నుంచి వచ్చిన లీకుల ద్వారానో నల్లగొండ కార్పొరేషన్‌లో రిజర్వేషన్లు మారాయంటూ, 1 నుంచి 48 వార్డుల వరకు రిజర్వేషన్లు ఇవే అంటూ వాట్స్‌పలో జాబితా చక్కర్లు కొడుతోంది. అయితే రిజర్వేషన్ల మార్పు విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మునిసిపల్‌ అధికారులు తెలిపారు.

ఫ గతంలో రిజర్వేషన్లు ఇలా..

కేటగిరీ వార్డులు

జనరల్‌ 5, 6, 8, 13, 17, 22,

24, 32, 36, 41

జనరల్‌ మహిళ 7, 9, 11, 16, 19, 25,

26, 33, 34, 39, 40, 48

బీసీ జనరల్‌ 23, 27, 28, 31, 38,

44, 47

బీసీ మహిళ 1, 18, 20, 21, 35, 37,

39, 43, 45, 46

ఎస్సీ జనరల్‌ 3, 4, 12, 29

ఎస్సీ మహిళ 2, 15, 29

ఎస్టీ జనరల్‌ 10, 14

Updated Date - Jan 08 , 2026 | 12:41 AM