kumaram bheem asifabad- ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:07 PM
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం అంక్షలు విధించింది. దీంతో పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వినియోగించారు. ఒక సిలిండర్ బుక్ చేసిన తరువాత మళ్లీ తీసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 35, గ్రామీణ ప్రాంతాల వారు 45 రోజులు ఆగేవారు. ప్రస్తుతం గ్యాస్ సరఫరా మెరుగుపడడంతో ఆంక్షలను సడలించారు.
వాంకిడి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం అంక్షలు విధించింది. దీంతో పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వినియోగించారు. ఒక సిలిండర్ బుక్ చేసిన తరువాత మళ్లీ తీసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 35, గ్రామీణ ప్రాంతాల వారు 45 రోజులు ఆగేవారు. ప్రస్తుతం గ్యాస్ సరఫరా మెరుగుపడడంతో ఆంక్షలను సడలించారు. 25 రోజులకే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25 రోజులకు సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడంతో గ్యాస్ గోదాముల వద్ద రద్దీ బాగా తగ్గింది. 45 రోజులకు బుకింగ్ చేసుకోవాలని ఆంక్షలు ఉన్నప్పుడు సిలిండర్ రీఫిల్ కోసం గోదాముల వద్ద వినియోగదారులు బారులు తీరేవారు. ఒక బుడ్డీ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాసే వారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉంటే సిలిండర్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో టిఫిన్ల ధరలు పెంచారు. ప్రజలు ఇళ్లల్లోనూ పొదుపుగా వాడారు. గ్యాస్‌కు బదులుగా కట్టెల పోయిలను వినియోగించారు. ప్రస్తుతం మళ్లీ పూర్వపు పరిస్థితులు నెలకొనడంతో వనియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
- కొత్త కనెక్షన్ల కోసం..
కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీపై కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా నిషేధం అమలు చేస్తోంది. గత మార్చి నుంచి ఏజెన్సీలు, కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో గ్యాస్ కనెక్షన్ ఇప్పటి వరకు లేని వారు, కొత్తగా పెళ్లయిన జంటలు, వేరు కాపురాలు పెట్టిన వారు, జీవనో పాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏజెన్సీలవద్ద మూడువేలకుపైగా చేసు కున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ విని యోగం పెరుగడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల అవసరం అంతకం తకూ పెరుగుతోంది. కొత్త కనెక్షన్లు పునఃప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించ లేదు. దీంతో గ్యాస్ కనెక్షన్లపై అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇంధన దిగుమతి సరిగా లేక పోవడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే సంక్షోభం మరింత పెరుగుతుందని భావిం చిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కున్నట్టు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పుటినుంచి ఎల్‌పీజీ కొత్త కనెక్షన్లను జారీ చేయడంలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో వారు దరఖాస్తులను తీసుకోవడంలేదు. జిల్లాలోని 12 గ్యాస్ ఏజెన్సీల్లో 1,41,212 గృహఅవసర కనె క్షన్లు ఉన్నాయి. ప్రతి నెల 52 వేల సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని ఏజెన్సీల్లో 17 వేలు, ఆసిఫాబాద్‌లో 8 వేలు, కౌటాలలో 6 వేలు సరఫరా అవతున్నాయి. కొత్త కనెక్షన్లు జారీ చేస్తే ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది.