Share News

kumaram bheem asifabad- రైతులకు ఊరట

ABN , Publish Date - Jul 09 , 2026 | 10:14 PM

వానాకాలం సాగు వేళ రైతులకు ఊరట కలి గించేలా ప్రభుత్వం యూరియా పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు యాప్‌ ఆధారంగా ఎకరాకు పరిమిత మోతాదులో మాత్రమే యూరియా ఇవ్వడంతో ఇవ్వడంతో రైతులు పలుమార్లు ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయశాఖ యాప్‌లో ఇటీవల మార్పులు చేసి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

kumaram bheem asifabad-  రైతులకు ఊరట
లోగో

- సులభతరం చేసిన వ్యవసాయశాఖ

చింతలమానేపల్లి/కాగజ్‌నగర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగు వేళ రైతులకు ఊరట కలి గించేలా ప్రభుత్వం యూరియా పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు యాప్‌ ఆధారంగా ఎకరాకు పరిమిత మోతాదులో మాత్రమే యూరియా ఇవ్వడంతో ఇవ్వడంతో రైతులు పలుమార్లు ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయశాఖ యాప్‌లో ఇటీవల మార్పులు చేసి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త విధానం ప్రకారం రెండెకరాల వరకు సాగు చేస్తున్న రైతులకు అవసరమైన యూరియాను ఒకేసారి అందజేయను న్నారు. గతంలో విడతల వారీగా ఇవ్వడంతో సన్న, చిన్న కారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఒకేసారి యూరియా లభించడంతో సమ యం, రవాణా ఖర్చు తగ్గే అవకాశం ఉన్నది. రెండు నుండి ఐదెకరాల వరకు సాగు చేసే రైతులకు యూరియాను రెండు విడతల్లో అందించనున్నారు. అలాగే ఐదెకరాలకు పైగా ఉన్న రైతులకు మూడు విడతల్లో పంపిణీ కొనసాగనున్నది. అయితే విడతల మద్య ఉండే గడువును ప్రభుత్వం 15 రోజుల నుండి 20 రోజులకు పెంచింది. దీంతో పంట దశను బట్టి రైతులు మరింత అనువుగా యూరియాను పొందే అవకాశం ఏర్పడింది. అయితే రైతులకు యాప్‌ లేకున్నా మీ సేవా కేంద్రాల్లో రూ. 10 రుసుముతో బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది

- జిల్లాలో ఇలా..

జిల్లాలోని ఈ వానాకాలం సీజన్‌లో సుమారుగా 4.6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తుం డగా ఇందులో అత్యధికంగా 3.0 లక్షల ఎకరాల్లో పత్తి పంట తర్వాత స్థానం 80 వేల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. 40 వేల ఎకరాల్లో కందులు, మరో 20వేల ఇతర పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో 90 శాతం మేర రైతులు సాగు పనులు పూర్తి చేశారు. పత్తి రైతులు పత్తి విత్తనాలు పెట్టడంతో పాటు వరి సాగు కోసం రైతులు నారు పోశారు. ఇతర పంటల సాగుపై దృష్టి సారించారు. అయితే ఎకరాకు 2 యూరియా బస్తాల చొప్పున యూరియా ఇస్తుండగా యూరియా పంపిణీ యాప్‌ద్వారా నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు యూరియాను తీసుకోగా ఇప్పటి వరకు జిల్లాలో 18,555 బస్తాల యూరియా అందుబాటులో ఉంది. రైతలకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా యూరియా నిల్వలు ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌- ఇజ్రాయిల్‌ దేశాల మధ్య నడిచిన యుద్దం కారణంగా ఉత్పత్తికి అవసరమయ్యే ముడి సరకు సరఫరా సక్రమంగా కాకపోవడంతో దేశంలో యూ రియా ఉత్పత్తి తగ్గిపోయింది. అందుబాటులో ఉన్న యూరియాను కావాల్సిన మేరకు వాడుకునేందుకు, రైతులు ఎడాపెడా వాడుతున్న యూరియాను తగ్గించేందుకు గత యాసంగి సీజన్‌ నుండి యూరియా యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఒక ఎకరాకు రెండు నుండి మూడు బస్తాల వరకు ఒకేసారి కాకుండా 15రోజుల వ్యవధిలో యూరియా ఇచ్చే విధంగా యాప్‌ను రూపొం దించారు. ఈ యాప్‌ వల్ల గడిచిన యాసంగి సీజన్‌లో యూరియా వాడకం తగ్గింది. యాప్‌ వల్ల రైతులకు మాత్రం ఇబ్బందులు తగ్గలేదు. ఇప్పటికీ రైతుల వద్ద ఇవ్వాల్సిన ధర కంటే డీలర్లు ధర రూ. 50 నుండి 80 వరకు అధికంగానే వసూలు చేస్తున్నట్లు ఆరోప ణలు ఉన్నాయి.

- మూడు విడతల్లో..

యూరియా యాప్‌ ద్వారా మూడు విడతల్లో ఒక్కో ఎకరాకు ఒక్కో బస్తా తీసుకురావడాన్ని రైతు లు వ్యతిరేకించారు. యాప్‌లో పరిమితుల కారణం గా అనేక ప్రాంతాల్లో రైతులు అవసరమైన సమ యంలో యూరియా తీసుకోలేక ఇబ్బందులు పడ్డా రు. ఈ విషయంపై రైతు సంఘాలు, వ్యవసాయ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సాంకే తిక మార్పులు చేపట్టినట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎరువుల దుకాణాల్లో యాప్‌ను నవీకరించి పంపిణీ చేపట్టాలని సూచించారు. రెండుకరాలకు ఒకేసారి యూరియా ఇవ్వాలని పేర్కొన్నారు. యూరియా వినియోగంలో సమతుల్యత పాటించాలని, పంట అవసరాన్ని బట్టి మాత్రమే ఎరువులు వాడాలని రైతులకు సూచిస్తున్నారు. కొత్త విధానం అమలుతో రైతుల ఇబ్బందులు తగ్గడంతో పాటు యూరియా పంపిణీ మరింత పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 10:14 PM