kumaram bheem asifabad- పత్తి రైతులకు ఊరట
ABN , Publish Date - May 21 , 2026 | 10:08 PM
జిల్లా లో సాగయ్యే పంటల్లో ప్రధానమైనది పత్తి పంట.. వచ్చే వానాకాలానికి సంబంధించి పత్తి విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. గతేడాది నిర్ణయించిన ధరలే కొనసాగేలా చర్యలు చేపట్టింది. దీంతో పత్తి రైతులకు ఊరట లభించింది. ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జిల్లాలో సాగుతోంది
- గతేడాది ధరలే ఉండాలని ఆదేశం
- జిల్లాలో 3.6 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
- 5.8 లక్షల విత్తన సంచులు అవసరమని అధికారుల అంచనా
చింతలమానేపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో సాగయ్యే పంటల్లో ప్రధానమైనది పత్తి పంట.. వచ్చే వానాకాలానికి సంబంధించి పత్తి విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. గతేడాది నిర్ణయించిన ధరలే కొనసాగేలా చర్యలు చేపట్టింది. దీంతో పత్తి రైతులకు ఊరట లభించింది. ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జిల్లాలో సాగుతోంది. పత్తి విత్తనాల ధరలు గతేడాది ధరలే ఉండడంతో రైతులకు కొం మేలు జరుగనుంది.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 3.6 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా పత్తి పంటనే జిల్లా రైతులు సాగుచేస్తున్నారు. తర్వాత స్థానాల్లో వరి, కంది, సోయాబీన్, ఇతర పంటలు సాగవుతాయి. అయితే వీటికి 5.8 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమయ్యే అవకాశం ఉన్నది. జిల్లా రైతాంగాకి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని పల ఫర్టిలైజర్ షాపుల్లో విత్తన ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. రిపత్తి విత్తనాలకు రైతులు ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడతారు. మార్కెట్లో బీటీ-1, బీటీ-2 రకాలు అందుబాటులో ఉన్నా బీటీ-2 రకాల విత్తనాలే అధికంగా వాడతారు. అనేక కంపెనీలు పలు పేర్లతో అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు మార్కెట్లో విడుదల చేస్తాయి. జిల్లాలో పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న నేపథ్యంలో అవసరమైన పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2024-25 వానాకాలంలో ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ. 864 ఉండగా గతేడాది ఒక్కో ప్యాకెట్‌కు ధర రూ. 37 పెంచి 901 రూపాయి చేశారు. గతేడాది ధర పెంపుతో జిల్లాలోని రైతులకు కోటిపైనే ధర భారం పడింది. ఈ ఏడాది గతేడాది ధర అంటే రూ. 901 కే పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయించాలని ఆదేశాలివ్వడంతో రైతులకు మేలు జరుగనుంది.
- మార్కెట్లో పలు రకాలు..
మార్కెట్లో పలు రకాల పేర్లతో విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతుండగా ఏ రకం మంచిదో..ఏ రకం మంచిది కాదో తెలియకుండా పోతుంది. సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాల విక్రయాలు మొదలయ్యాయి. జిల్లాలో ఇప్పటికే నకిలీ విత్తన సరఫరాపై అధికార యంత్రాగం చర్యలు తీసుకుం టోంది. పట్టుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు. అయితే కేంద్రం ఇటీవల పత్తి పంటకు గిట్టుబాటు ధరను సైతం పెంచింది. రిపత్తి పంటకు రూ. 557 పెంచి పత్తి మధ్యస్థ పింజ రకానికి 8,267 మద్దతు ధర, అలాగే పత్తి పొడవు పింజ రకానికి 8,667 మద్దతు ధర కల్పించింది. కాగా పత్తి విత నాల సరఫరాను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘం నాయకులు డివండ్ చేస్తున్నా..కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విత్తనా భివృద్ది సంస్థ క్రియాశీలకంగా పని చేస్తుంది. ఆరు తడి పంటలు, పత్తి రొట్ట, సోయాబీన్, విత్తనాలను స్సిడీపై పంపిణీ చేస్తుంది. అదే తరహాలో పత్తి విత్త నాలను కూడా తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ద్వా రా పంపిణీ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.