Share News

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట....

ABN , Publish Date - Nov 22 , 2026 | 10:51 PM

ఏండ్ల త రబడి అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి తమ సొమ్ము తి రిగి వస్తుందని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న బా ధితులకు ఎట్టకేలకు ఊరట కలిగించే చర్యలు ప్రారం భమయ్యాయి.

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట....

బాండ్ల వెరిఫికేషన్‌కు సన్నద్ధం

జనవరి 28 నుంచి మండలాల వారీగా పరిశీలన

అవినీతి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

జిల్లాలో 6250 మంది బాధితులు

మంచిర్యాల, నవంబర్‌ 22(ఆంధ్రజ్యోతి) : ఏండ్ల త రబడి అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి తమ సొమ్ము తి రిగి వస్తుందని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న బా ధితులకు ఎట్టకేలకు ఊరట కలిగించే చర్యలు ప్రారం భమయ్యాయి. ఈ మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాండ్ల వెరిఫికేషన్‌కు సన్నద్ధమవుతుండగా మండలా ల వారీగా తేదీలు నిర్ణయించారు. బాధితుల డిపాజిట్‌ బాండ్లు, నగదు రశీదుల పరిశీలనకు తెలంగాణ సీఐడీ ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. మంచిర్యాల జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాంతంలోని బా ధితుల కోసం జిల్లా కేంద్రంలోని నస్పూర్‌ పోలీస్‌ స్టేష న్‌లో ప్రత్యేకంగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ కేంద్రం ఏ ర్పాటు చేశారు. జనవరి 28 నుంచి మార్చి 1 వరకు మండలాల వారీగా బాండ్ల పరిశీలన చేపట్టనున్నారు.

అగ్రిగోల్డ్‌ స్కీములో మద్య తరగతి, పేద ప్రజలతో పాటు రిటైర్డు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు పెద్ద మొ త్తంలో డిపాజిట్‌ చేసినట్లు తేలింది. అగ్రిగోల్డ్‌ సంస్ధ ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌, భూములు, ప్లాట్లపై అధిక రాబడులు వస్తాయని చెప్పి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది. ఇందులో భాగంగా అనేక కంపెనీల ద్వా రా ప్రజలను పెట్టుబడులకు ఆకర్షించగా డిపాజిట్‌ చే సిన వారికి గడువు ముగిసిన తర్వాత డబ్బు, లేదా ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రజల నుంచి సేకరిం చిన డబ్బును సంబంధిత భూముల కొనుగోలుకు పూ ర్తిగా వినియోగించకుండా ఇతర వ్యాపారాలకు మళ్లిం చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గడువుముగిసిన తర్వాత నగదు చెల్లింపులు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే బాధి తులు పోలీసులను ఆశ్రయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1.65 లక్షల మంది బాధితులు....

అగ్రిగోల్డ్‌ సంస్థలో పెట్టుబడుల పేరుతో తెలంగాణా లో సుమారు 1.65 లక్షల మంది బాధితులకు చెందిన 447 కోట్ల వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోం ది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధితుల పెట్టుబడుల వివరాలను దృవీకరించి అర్హుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పది కేంద్రాల్లో బాండ్ల వెరిఫికేషన్‌ చేపట్టేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. బాధితుల వివరాలు పక్కాగా నమో దు చేయడం పరిహార ప్రక్రియకు కీలకంగా మారనుంది.

నస్పూర్‌లో ప్రత్యేక కేంద్రం....

మంచిర్యాల, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల బాధితుల కోసం నస్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ప్రత్యేక వెరిఫికేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. మం డలాల వారీగా నిర్ణయించిన తేదీలలో బాధితులు హాజ రై తమ బాండ్లు, రశీదులను పరిశీలన చేయించుకో వా ల్సి ఉంటుంది. పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో భాగంగా అసలు అ గ్రిగోల్డ్‌ బాండ్‌ లేదా నగదు రశీదు, సంతకం చేసిన క లర్‌ జిరాక్సు కాపీ, ఆధార్‌, పాన్‌ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌ మొదటి పేజీ జిరాక్సు, పాస్‌ పోర్టు సైజ్‌ ఫోటో, మొబైల్‌ నంబర్‌ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. బ్యాం కు ఖాతా ఐఎఫ్‌ఎస్‌సీ స్పష్టంగా ఉండడంతో పాటు డి పాజిటర్‌ మరణిస్తే నామినీ, లేదా చట్టబద్ద వారసులు మరణ దృవీకరణ పత్రం, వారసత్వానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అసలు బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని, తమ పరిశీలన కోసం చూపించి సంతకం చేసిన జిరాక్సు కా పీలను మాత్రమే సమర్పించాలని సీఐడీ స్పష్టం చేసింది.

పరిహారం కోసం ఎదురుచూపులు...

బాండ్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావడంతో త మ పెట్టుబడుల వివరాలు అధికారికంగా నమోదవుతా యని బాధితులు ఆశిస్తున్నారు. వెరిఫికేషన్‌ అనంతరం పరిహారం చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచ రణ ప్రకటించాలని, ఆస్తుల విక్రయం ద్వారా సేకరించే నిధుల బాధితులకు త్వరగా అందించాలని కోరుతున్నా రు. తమ జీవిత కాల పొదుపు కోల్పోయిన బాధితు లకు ఈ ప్రక్రియ న్యాయం చేస్తుందనే దిశగా కీలక అ డుగులు పడతాయనే భావనలో బాధితులున్నారు.

జిల్లాలో 6250 మంది బాధితులు.......

జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ సంస్థ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో 6250 మంది ఉన్నారు. వీరందరికి నిర్ణీత సమయం ప్రకారం మండలాల వారీగా దృవీకరణ ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి జిల్లాలో వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండగా మార్చి 1న ముగియనుంది. ఈ మేరకు నస్పూర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఏయే మండలానికి ఏ రోజు వెరిఫికేషన్‌ ప్రక్రియ ఉంటుందో తెలియజేయనున్నారు. ఇందుకోసం వై కృష్ణరెడ్డి అనే అధికారిని 8179163403 నంబర్‌లో సంప్రదించాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. సీసీసీ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 25 నుంచే బాధితుల పేర్ల నమోదు కార్యక్రమం చేపడుతుండగా మండలాల వారీగా మాత్రం జనవరి 28వ తేదీ నుంచి ప్రక్రియ ప్రార ంభించనున్నారు. అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలి.....రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ఆద్వర్యంలో చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బాండ్లు, నగదు రశీదుల దృవీకరణ, నమోదు ప్రక్రియ కోసంప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 25 నుంచి పేర్ల నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుండగా బాధితులు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Nov 22 , 2026 | 10:51 PM