Share News

బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:12 PM

మహి ళా రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ మహిళరిజర్వేషన్‌ స్పష్టమై న విదానంతో ఉందని ఆపార్టీ గమనిస్తే బాగుం టుం దని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘు నాధ్‌రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి

మందమర్రిటౌన్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): మహి ళా రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ మహిళరిజర్వేషన్‌ స్పష్టమై న విదానంతో ఉందని ఆపార్టీ గమనిస్తే బాగుం టుం దని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘు నాధ్‌రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవ డానికి కారణం కాంగ్రెస్‌, దాని మిక్షాలదే అని బీజేపీ పేర్కొనడం సిగ్గు చేటన్నారు. తమ పార్టీ మహిళ సం క్షేమం, రాజకీయ సాదికా రతకు ఎప్పటి నుంచో కృషి చేస్తుందని మహిళలు 33 శాతం రిజర్వేష న్‌ ఇవ్వాలని 2008లోనే మహిళా బిల్లు ప్రవేశపెట్టిం దన్నారు. రాజ్య సభలో మెజార్టీ పాసైందని లోక్‌ సభలో 2/3 మెజార్టీ లేక వీగి పోయిందన్నారు. మహిళా హక్కుల కోసం మొదటి నుంచి కృషి చేస్తుందని తమ పార్టీనే అని అన్నారు. మొదటి మహిళా ప్రధాని, మొదటి రాష్ట్రపతి, మొదటి మహిళ ముఖ్య, మొదటి మహిళా గవర్నర్‌, ఘనత కాంగ్రెస్‌దే అ న్నారు. 2023లో బీజేపీ ప్రభుత్వం బిల్లును పార్ల మెం టులోపాస్‌ చేసి దానిని ఎందుకు చట్టరూపంలో తీ సుకు రాలేదో ప్రజలకు చెప్పాలన్నారు. ఇటీవల బీజేపీ ప్రవేశ పెట్టిన మహిళా బిల్లులో వారి స్వలాభం తప్ప ప్రజా ప్ర యోజనాలు, మహిళా ప్రయోనాలు లేవని అన్నారు. దీనితో అంతేగాకుండా డిలిమిటేషన్‌ పేరిట రాష్ర్టాల ప్రా ధాన్యత తగ్గించే విధంగా ఉందన్నారు.

ఇకనైన తప్పుడు ప్రచారాలు బీజేపీ మానుకుంటే మం చిదన్నారు. నిరంతరం ప్రజా మహిళా సంక్షేమమే లక్ష్యం గా పని చేస్తున్న ఏకైక తమ పార్టీ అని అన్నారు. ఈ స మావేశంలో నాయకులు కౌన్సిలర్లు ప్రభాకర్‌, గుర్రం శ్రీనివాస్‌, మం తెన రంజిత్‌, రవి, రాంసాయిలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 10:12 PM