Share News

నాన్‌ లే అవుట్‌ ప్లాట్ల క్రమబద్ధీకరణ...

ABN , Publish Date - May 07 , 2026 | 11:33 PM

లే అవుట్‌ అనుమతుల్లేని వెంచర్లు, అనధికార ప్లాట్లను క్రమబ ద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ రుసుము, ఇతర చార్జీ లపై 25 శాతం రాయితీ కల్పిస్తూ జీవో 131 ప్రకా రం ఉత్తర్వులు జారీ చేసింది.

నాన్‌ లే అవుట్‌ ప్లాట్ల క్రమబద్ధీకరణ...

-రుసుముపై 25 శాతంతో రాయితీ

-ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

-జూలై 31 వరకు రెగ్యులేషన్‌కు అవకాశం

-జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌

-ప్రత్యేక ఆఫర్‌తో కొలిక్కి వచ్చే అవకాశం

మంచిర్యాల, మే 7 (ఆంధ్రజ్యోతి): లే అవుట్‌ అనుమతుల్లేని వెంచర్లు, అనధికార ప్లాట్లను క్రమబ ద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ రుసుము, ఇతర చార్జీ లపై 25 శాతం రాయితీ కల్పిస్తూ జీవో 131 ప్రకా రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందు కోసం మూడు నెలల పాటు అవకాశం కల్పించింది. జూలై 31వ తేదీలోపు అనధికార వెంచర్లు, ప్లాట్లను క్రమబద్దీక రించుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్‌ వర్తించనుం ది. రెండేళ్లుగా తీవ్ర మాంధ్యాన్ని ఎదుర్కొంటున్న రి యల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రభుత్వ నిర్ణయం కొంత మేర ఉపశమనం కలిగించనుంది. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వ హయాంలో ప్రారంభమైన రియల్‌ ఎస్టేట్‌ రం గంపై ఆంక్షల కారణంగా రెండున్నరేళ్లుగా ఆరంగం పై ఆధారపడ్డ వ్యాపారులు ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024లో కొన్ని సంస్కరణలు చేసినా... అవి పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఫీజులో రాయితీ ఇస్తూ మరోమారు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయి తీల్లో 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం) గడువు ముగిసిపోగా, దాదాపు నాలుగేళ్ల త రువాత తిరిగి 2020 ఆగస్టు 31న ఆ ప్రక్రియ కు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే రోజు నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి వస్తుందం టూ నిబంధనలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిం ది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి నాటి ప్ర భుత్వం ఎలాంటి నియమ నిబంధనలు విడుదల చే యకపోవడంతో ధరఖాస్తు ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌ కేంద్రాల్లో సంబంధిత వెబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో ధరఖాస్తు ప్రక్రియకు బ్రేక్‌ పడింది. దీంతో చాలా కాలం తరువాత వచ్చిన అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న ప్రజలకు నాటి ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన....

ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్పటి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో స్పందన వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపు మీదున్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయి తీల్లో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండగా, మిగ తా చోట్ల అరకొరగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా లోని మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌, బెల్లం పల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట మున్సిపాలి టీల్లో అధిక సంఖ్యలో భూములు ఉన్నాయి. వాటిలో అనధికార లే అవుట్‌ వెంచర్లు ఎక్కువగా ఉండటం తో సంబంధిత ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసేందుకు ముందుకు వచ్చారు. జిల్లా కేంధ్రంలోనే పదుల సంఖ్యలో అక్రమ లే ఔట్లు ఉండగా, లక్షెట్టి పేట, చెన్నూరు, బెల్లంపల్లి మున్సిపాలిటీల పరిధి లో కూడా అధిక సంఖ్యలో అక్రమ వెంచర్లు ఉన్నా యి. గ్రామ పంచాయతీల పరిధిలో కూడా అక్రమ వెంచర్లు, ప్లాట్లు అధికంగా ఉండగా హాజీపూర్‌, జై పూర్‌, భీమారం, లక్షెట్టిపేట లాంటి ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.

49వేల దరఖాస్తులు పెండింగ్‌...

జిల్లాలోని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీ ల్లో క్రమబద్దీకరణ కోసం చేసిన మొత్తం 49,785 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 56,2020 ఆగ స్టు 26 లోపు రిజిష్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా జరిగిన నా న్‌ లే అవుట్‌ వెంచర్లు, ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింప జేయనున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాపారుల నుంచి భారీ స్పందన లభించింది. ఎల్‌ ఆర్‌ఎస్‌కు నామ మాత్రంగా రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో జిల్లా వ్యాప్తంగా 2020 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో మున్సిపాలిటీల్లో ఏకంగా 45,863 దరఖా స్తులు వచ్చాయి. వాటిలో 5,097 దరఖాస్తులను ఆ మోదించగా, 1,723 దరఖాస్తులను తిరస్కరిం చారు. ఇంకా 39,043 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుదారులంతా నిబంధనల మేరకు క్రమబ ద్దీకరణ ఫీజు 25 శాతం రాయితీతో చెల్లించాల్సి ఉంది. అలాగే గ్రామ పంచాయతీల నుంచి 10,742 దరఖాస్తులు రాగా, వాటిలో అర్హతగల 7,674 మం దికి రసుము చెల్లించాలనే లేఖలు జారీ అయ్యాయి. లేఖలు జారీ అయిన వారిలో 2,402 మంది రుసు ము చెల్లించగా, 1,058 మందికి ప్రొసీడింగ్‌లు జారీ చేశారు.

స్పందన లభించేనా...?

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియర్‌ చేయాలని నిర్ణయించినందున దరఖాస్తుదారుల నుంచి ఏ మేర కు స్పందన ఉంటుందో వేచి చూడాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులపై 25 శాతం రాయితీ ప్రకటించినందున రి యల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 14 శాతం ఫీజులు చెల్లించలేని వారు నాలుగేళ్లు గడుస్తున్నా క్రమబద్దీక రణకు ముందుకు రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం రా యతీ ప్రకటించినందున ఇప్పటికైనా సమస్యలు కొలి క్కి వస్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎల్‌ఆర్‌ ఎస్‌లో భాగంగా ఇప్పటికే మొదటి దశలో దరఖాస్తు లు స్వీకరించగా, రెండో దశలో నిర్దారిత ఫీజు చెల్లిం చాల్సిందిగా దరఖాస్తుదారులకు నోటీసు జారీ చేశా రు. మూడో దశలో పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించి, అవసరైన ధృవీకరణ పత్రాలను సమర్పించే వారికి అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులు జారీ చేస్తా రు. అలాగే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల ఆధ్వ ర్యంలో సంబంధిత అధికారులు దరఖాస్తులను పరి శీలించి అర్హత ఉన్నచోట లే అవుట్‌ అనుమతు లు మంజూరు చేస్తారు.

Updated Date - May 07 , 2026 | 11:33 PM