హైదరాబాద్‌లో మరో జీసీసీ: మంత్రి దుద్దిళ్ల
ABN , Publish Date - May 27 , 2026 | 04:20 AM
హైదరాబాద్‌లో మరో ప్రపంచ సామర్థ్య కేంద్రం (జీసీసీ) ఏర్పాటు కానుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. న్యూయార్క్‌లో....
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మరో ప్రపంచ సామర్థ్య కేంద్రం (జీసీసీ) ఏర్పాటు కానుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. న్యూయార్క్‌లోని ట్యారిటౌన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం మన ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రీజెనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ బ్యారీ కోవల్ ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయింది. ఈ సందర్బంగా మంత్రి సమక్షంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించి బ్యారీ కోవల్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ిసీఈవో సర్వేశ్ సింగ్‌లు అవగాహన పత్రాన్ని (ఎంవోయూ) మార్చుకున్నారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జీసీసీల రాకతో మన ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతా యని పేర్కొన్నారు.