Higher Education Reforms: ఉన్నత విద్యలో సంస్కరణలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:46 AM
ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు చేపట్టాలని, ఉపాధి కల్పనే లక్ష్యంగా కోర్సులు ఉండాలని తెలంగాణ...
డిగ్రీ, పీజీ కోర్సుల సిలబస్ సమీక్షించాలి: కె.కేశవరావు
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు చేపట్టాలని, ఉపాధి కల్పనే లక్ష్యంగా కోర్సులు ఉండాలని తెలంగాణ విద్యావిధానం కోసం ఏర్పాటైన కమిటీ చైర్మన్ కె.కేశవరావు సూచించారు. డిగ్రీ, పీజీతోపాటు అన్ని స్థాయిల్లో కోర్సులను సమీక్షించాలని, నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడ్డారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా మాట్లాడుతూ.. ఈనెల 5లోపు ఉన్నత విద్యలో అన్ని కోర్సుల సిలబ్‌సపై నివేదిక ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న అధికారులను ఆదేశించారు. అన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షి్‌పను తప్పనిసరి చేయాలని, చదువులో అత్యంత ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు అదే తరగతిలో పాఠాలు బోధించే అవకాశం కల్పించాలన్నారు. ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలను యువత చేజిక్కించుకునేలా కార్యచరణ అమలు చేయనున్నామన్నారు.