kumaram bheem asifabad-యూరియా వాడకాన్ని తగ్గించాలి
ABN , Publish Date - May 15 , 2026 | 10:15 PM
పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు అనురాధ, సౌజన్య, అమీర్‌భాషా, అర్చన, కరుణి అన్నారు. మండలంలోని రెబ్బెన, ముంజంపల్లి గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు.
బెజ్జూరు, మే 15 (ఆంధ్రజ్యోతి): పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు అనురాధ, సౌజన్య, అమీర్‌భాషా, అర్చన, కరుణి అన్నారు. మండలంలోని రెబ్బెన, ముంజంపల్లి గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా అధిక రసాయనాలు, ఎరువుల వాడకంపై కలిగే నష్టాలు, అధిక వాడకం తగ్గించాలని సూచించారు. ప్రతి యేటా పంట మార్పిడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగరాజు, ఏఈవో మీనా, సర్పంచ్ బానయ్య తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌లు ఉపేందర్, సుమిత్రలు రైతులకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానం, ఎరువుల యజమాన్య, పురుగులు, వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు పలు విషయాలపై నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏవో ప్రేమలత, ఏఈవో ఘన్‌శ్యాం, సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ కేశవరావు, కార్యదర్శి అనుషా తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం కర్జీ గ్రామంలో శుక్రవారం వ్యవసాయాధికారులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంటల సాగు, యూరియా వాడకం, రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సీహెచ్ భరత్‌భూషన్‌రావు, డాక్టర్ శిరీష, ఏఈవో సుస్మీత, సర్పంచ్ అంకుబాయి, వార్డు సభ్యులు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలం కోమటిగూడ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. పంట, మార్పు, పచ్చిరొట్టే ఎరువుల వినియోగం పై వివరించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా వేసవిదుక్కుల్లో కలియ దున్నాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజశేఖర్, ఏయూ అరవింద్, సర్పంచ్ మోతిరాం, కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.