సమాజ సేవలో రెడ్ల పాత్ర కీలకం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:43 PM
సమాజ సేవలో రెడ్డి కులస్థులు కీలకపాత్ర పోషించాల్సి ఉందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : సమాజ సేవలో రెడ్డి కులస్థులు కీలకపాత్ర పోషించాల్సి ఉందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని టీసీఆర్ గార్డెన్‌లో పాలమూరు రెడ్డిసేవాసమితి నియోజకవర్గ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆర్థికంగా వెనకబడిన రెడ్డి కులస్థులకు ప్రతీ ఒక్కరు చేయూతనందించాలని సూచించారు. అన్నిరంగాలలో రెడ్లు తమదైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు పసుల శేఖర్‌రెడ్డి, భూపతిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి(వైఎస్), కృష్ణారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, లక్ష్మారెడ్డి, భారతిరెడ్డి, జంగారెడ్డి, విజయరెడ్డి, వెంకట్‌రెడ్డి ఉన్నారు.