kumaram bheem asifabad-నాడు సాధారణ ప్రసవాల్లో రికార్డు
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:23 PM
ఒకప్పుడు రాష్ట్రం లో రికార్డు స్థాయిలో సాధారణ కాన్సులు చేసిన ఆసుప త్రికి నేడు సిబ్బంది కరువయ్యారు. సాధారణ కాన్పులకు నిలయండి మారిన కౌటాల ఆసుపత్రి నేడు వసతులు లేక విలవిలాడుతోంది. ఒకే ఏడాది 553 సాధారణ కాన్సులు చేసినందుకు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో అవార్డు పొంది నేడు సాధారణ కాన్సులు చేసేందుకు కేవలం ఒకే ఒక వైద్యుడు దిక్కయ్యారు
- ఒకే ఏడాది 553 సాధారణ కాన్పులు
- రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో అవార్డు
కౌటాల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు రాష్ట్రం లో రికార్డు స్థాయిలో సాధారణ కాన్సులు చేసిన ఆసుప త్రికి నేడు సిబ్బంది కరువయ్యారు. సాధారణ కాన్పులకు నిలయండి మారిన కౌటాల ఆసుపత్రి నేడు వసతులు లేక విలవిలాడుతోంది. ఒకే ఏడాది 553 సాధారణ కాన్సులు చేసినందుకు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో అవార్డు పొంది నేడు సాధారణ కాన్సులు చేసేందుకు కేవలం ఒకే ఒక వైద్యుడు దిక్కయ్యారు. కౌటాల ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి ఘన చరిత్ర చూసి మూడు సార్లు నేషనల్ టీం పరిశీలించి మంచి మార్కులు కూడా ఇచ్చింది. అయినప్పటికీ అధికారుల పట్టింపు కరువైంది. కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో సాధారణ కాన్పుల చేయడంలో ఘన చరిత్ర ఉంది. 2016 సంవత్సంలో 111 సాధారణ కాన్పులు చేశారు. 2017లో 447, 2018లో 425, 2019లో 552, 2020లో 553, 2021లో 517, 2022లో 414, 2023లో 279, 2024లో 147 మందికి సాధారణ కాన్పులు నిర్వహించారు.
రోగుల తాకిడి..
కౌటాల పీహెచ్‌సీకి ప్రతి రోజు ఎంతో మంది రోగులు ఆసుపత్రికి వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు. కాన్పుల కోసం కౌటాల మండలం నుంచి కాకుండా చింతల మానేపల్లి, బెజ్జూరు నుంచి కూడా వచ్చే వారు ప్రస్తుతం సరైన సిబ్బంది లేక పోవడంతో ఆసుపత్రిలో సాదారణ కాన్పులు తగ్గాయి. కౌటాల ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకే వైద్యుడి తో (అది కూడా రెగ్యులర్ కాదు) నెట్టుకొస్తున్నారు. గతంలో అర్థరాత్రి అయినా కూడా కాన్పులు చేసేం దుకు సిబ్బంది సిద్ధంగా ఉండేవారు. ప్రస్తుతం సిబ్బంది కొతర తీవ్రంగా వేధిస్తుండడంతో రాత్రి వేళ ఆసుపత్రిలో సిబ్బంది ఉండక పోవడంతో కాన్పుల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకే సారి పాము కాటే వేసిన వ్యక్తితో పాటు కాన్పు కోసం మరో గర్భిణి ఆసుపత్రికి రావడంతో అటు వైద్యులు, ఇటు స్టాఫ్ నర్సు ఇద్దరు చికిత్స కోసం పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది మెరుగైన చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే మరింత మెరుగైన చికిత్సలతో పాటు మళ్లీ సాధారణ కాన్పులు పెరిగే అవకాశం ఉంటుందని మండల ప్రజలు చెబుతున్నారు.. గతంలో సాధారణ కాన్పులకు నిలయమైన ఆసుపత్రికి వైద్యుల కరువు అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ కౌటాల ఆసుపత్రిని సందర్శించి అర్థరాత్రి వరకు తనిఖీలు నిర్వహించి వైద్యులను, సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. గతంలో రాష్ట్రంలోనే సాధారణ కాన్పుల విషయంలో కౌటాల ఆసుపత్రి రెండో స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తించి మళ్లీ కౌటాల ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. కానీ నేటికి కౌటాల ఆసుపత్రికి 31 పోస్టులు ఉండగా అందులో సగం పోస్టులు ఖాళీగానే ఉండడం బాధాకర మైన విషయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కౌటాల మండలానికి మరో వైద్యుడిని నియమించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మండల వాసులు కోరుతున్నారు.