Share News

జాతీయస్థాయి విద్యావిధానంలో జిల్లాకు గుర్తింపు...

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:36 PM

జాతీయ స్థాయి విద్యావిధానంలో అమలులో మంచిర్యాల జిల్లా కు చోటు లభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల విడు దల చేసిన పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) ర్యాం కుల్లో జిల్లా జాతీయ స్థాయిలో 18వ స్థానం సాఽధించ గా, రాష్ట్రస్థాయిలో 360 స్కోర్‌తో ద్వితీయ స్థానం సా ధించి, ఉత్తమ్‌ విభాగాన్ని కైవసం చేసుకుంది.

జాతీయస్థాయి విద్యావిధానంలో జిల్లాకు గుర్తింపు...

-పీజీఐలో నేషనల్‌లో 18, రాష్ట్రంలో ద్వితీయ స్థానం

-సమష్టి కృషితో గుర్తింపు సాధించిన యంత్రాంగం

-ప్రత్యేక చర్యలతో ప్రతియేటా మెరుగైన ఫలితాలు

మంచిర్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి విద్యావిధానంలో అమలులో మంచిర్యాల జిల్లా కు చోటు లభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల విడు దల చేసిన పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) ర్యాం కుల్లో జిల్లా జాతీయ స్థాయిలో 18వ స్థానం సాఽధించ గా, రాష్ట్రస్థాయిలో 360 స్కోర్‌తో ద్వితీయ స్థానం సా ధించి, ఉత్తమ్‌ విభాగాన్ని కైవసం చేసుకుంది. జనగా మ జిల్లా 383 ర్యాంకింగ్‌తో రాష్ట్రస్థాయిలో మొదటి స్థా నంలో నిలిచింది. 2024-25 విద్యా సంవత్సరంలో 324 స్కోర్‌ చేసిన జిల్లా రాష్ట్రస్థాయిలో 3వ స్థానం సా ధిం చగా ప్రచెస్టా విభాగంలో శభాష్‌ అనిపించుకుంది. అ న్ని విభాగాలలో ప్రతిభను మెరుగుపరుచుకొని ఈ యే డు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభినందనలు అందుకుంటోంది. పాఠశాల విద్యారంగంలో జిల్లాల పనితీరును ఒకేరక మైన ప్రమాణాలతో (యూనిఫాం స్కేల్‌) అంచనా వే యడానికి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ జిల్లాల వారీగా పీజీఐని రూపొందించింది. పాఠశాల విద్యలో విప్లవా త్మక మార్పులు తీసుకురావడం, జాతీయ విద్యా విధా నం (ఎన్‌ఈపీ 2020) అమలును పర్యవేక్షించడం, జి ల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని పెం పొందించడం పీజీఐ ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాలకు ర్యాం కులు ఇవ్వడం ద్వారా కలిగే ప్రతికూల ప్రభావాలను ని వారించడానికి గ్రేడింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. పీజీఐ గణనకు అవసరమైన సమాచారాన్ని యూడైస్‌ ప్లస్‌, ప రాఖ్‌ రాష్ట్రీయ సర్వేక్షన్‌ (పీఆర్‌ఎస్‌) 2024, ప్రభంద్‌ పో ర్టల్‌ ద్వారా సేకరిస్తారు. యూడైస్‌ ప్లస్‌ నుంచి పాఠశా ల మౌళిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నమోదు, తదితర వివరాలు సేకరిస్తుండగా, పీఆర్‌ఎస్‌ నుంచి ఎన్‌సీఈఆర్టీ ద్వారా 3,6,9వ తరగతి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల ఆధారంగా లభించే డేటా, ప్రభం ద్‌ పోర్టల్‌ ద్వారా సమగ్ర శిక్షా నిధుల వినియోగం, పథకాల నిర్వహణ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

అంశాల వారీగా పాయింట్లు....

పీజీఐ మొత్తం ఆరు విభాగాల కింద 11 రంగాలు (డోమెయిన్స్‌), 70 సూచికల (ఇండికేటర్స్‌) ఆధారంగా జాతీయ స్థాయిలో 1000, రాష్ట్రస్థాయిలో 600 పాయిం ట్లకు లెక్కిస్తారు. ఇందులో ఫలితాలు, ప్రభావాత్మక తర గతి గది నిర్వహణ, మౌలిక వసతులు, బాలల పరిరక్ష ణ, డిజిటల్‌ అభ్యసనం, పాలనా క్రియలు అనే అంశా ల్లో విభాగాల వారీగా సూచికలు, పాయింట్లు కేటాయి స్తారు. రాష్ట్ర స్థాయిలో 600 పాయింట్లకు గాను జిల్లా 2022-23లో 212 స్కోరు సాధించగా, 2023-24లో 256, 2024-25లో 324, 2025-26లో 360 పాయింట్లు సా ధించింది. ప్రణాళికలో భాగంగా జిల్లాలో రూ. 44.8 కో ట్లతో మౌలిక వసతులు కల్పించారు. ఇందులో రూ. 1.22 కోట్ల డీఎంఎఫ్‌టీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను మౌలిక వసతులకు కేటాయించగా, అమ్మ ఆదర్శ పాఠ శాల పనుల ద్వారా సుమారు రూ. 21.58 కోట్ల అం చనా వ్యయంతో పరిపాలన అనుమతులు ఇవ్వడం ద్వా రా జిల్లాలోని 509 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, వి ద్యుత్‌ సౌకర్యం, అవసరమైన తరగతి గదుల మరమ్మ తులు, టాయిలెట్ల మరమ్మతులు, రన్నింగ్‌ వాటర్‌ సౌక ర్యం ఏర్పాటు చేశారు. అలాగే సమగ్ర శిక్ష, నాబార్డ్‌ ని ధులు రూ. 22 కోట్లతో కస్తూర్భాగాంధీ బాలికల విద్యా లయాలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు అదనంగా డా ర్మెటరీల నిర్మాణం, డైనింగ్‌ హాలు, కిచెన్‌ షెడ్లు, టాయి లెట్ల నిర్మాణం, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటు, కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ బ్లాక్‌ నిర్మాణం, తదితర ప నులతో బలోపేతం చేశారు. పాఠశాలల్లో పర్యవేక్షణ మెరుగుపరచడానికి 50 మంది సభ్యులతో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయుల ప్రణాళి క బోధన, పాఠశాలల పనితీరు, ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టంతో హాజరు శాతం మెరుగు పడటం ద్వారా అభ్యా సనా స్థాయిలు పెరగడం ఉత్తమ ఫలితాల సాధనకు తోడ్పడింది. కాగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించినందున మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారిణి డా.యోగితా రాణా ప్రత్యేకంగా అభినందిం చారు. కలెక్టర్‌ తరుపున జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారులు ఎం భరత్‌కుమార్‌, జంబోజు సత్తయ్య, ఏ రాజ్‌కుమార్‌లు హైద్రాబాద్‌లో విద్యాశాఖ సంచాలకు లు, ఐఏఎస్‌ అధికారి డా. నవీన్‌ నికోలస్‌ చేతుల మీ దుగా రెండు రోజుల క్రితం ప్రశంసలు అందుకున్నారు.

ప్రత్యేక ప్రణాళికతోనే గుర్తింపు....

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

విద్యా వ్యవస్థలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో నే జిల్లాకు జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభిం చిం ది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, రె వ్యూ తీసుకోవడం, క్రమం తప్పకుండా తనిఖీలు చేయ డం, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు వక్రమార్గంలో పయనించకుండా చర్యలు చేపట్టడం, ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచడం, సక్రమంగా పని చేసే వారిని ప్రోత్సహించడం ద్వారా లక్ష్య సాధనలో భాగస్వాముల ను చేయడం లాంటి చర్యలు మెరుగైన ర్యాంకు సాధిం చడానికి ఉపకరించాయి.

Updated Date - Jul 23 , 2026 | 11:36 PM