kumaram bheem asifabad- అంకితభావంతో పని చేస్తే గుర్తింపు
ABN , Publish Date - May 29 , 2026 | 10:36 PM
ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తే గుర్తింపు ఉంటుందని జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్‌కాస్టు గనిపై పదవీ విరమణ పొందుతున్న బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డిని శుక్రవారం ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానించారు.
రెబ్బెన, మే 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తే గుర్తింపు ఉంటుందని జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్‌కాస్టు గనిపై పదవీ విరమణ పొందుతున్న బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డిని శుక్రవారం ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ మాట్లాడుతూ అనుక్షణం సంస్థ అభివృద్ధి, కార్మికుల రక్షణ సంక్షేమం కోసల ఎల్లవేళలా జీఎం కృషి చేశారని కొనియాడారు. జీఎం మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేస్తే గుర్తింపు ఉంటుందని చెప్పారు. సంస్థ పురోభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఙతలు తెలిపారు. సింగరేణి మనుగడకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పీవో నరేందర్, ప్రాజెక్టు ఇంజ నీర్ వీరన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్‌బాబు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక, మానసికోల్లాసం
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగు తుందని బెల్లంపల్లి ఏరియా మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. గోలేటిలో అధికారుల క్లబ్‌లో శుక్రవారం వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు చిన్నారులను క్రీడల్లో రాణించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్రీడలపై ఆసిక్త పెంచితే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్నారులను సెల్‌ఫోన్‌కు దూరం ఉంచాలని సూచించారు. వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, సీఎంఏఐ ఉపాధ్యక్షుడు ఉజ్వల్‌కుమార్ బెహరా, పర్సనల్ హెచ్‌వోడీ ఎస్‌వీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పర్సనల్ అధికారి ఎం శ్రీనివాస్, గౌరవ కార్యదర్శి డి ప్రశాంత్, శిక్షకులు నరేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.