kumaram bheem asifabad- రోజూ రాబడే..
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:23 PM
రైతులకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయ లు. ప్రణాళికాబద్ధంగా దఫ దఫాలుగా వివిధ రకాల కూరగాయల పంటలను విత్తుకుంటూ ఉం డాలి. దీంతో ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ ప్రతీ రోజు అనేక రకాల కూరగాయలు చేతికి అందివస్తాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కార ణంగా భవిష్యత్తులో పంటలు, పప్పు ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడనున్న నేపథ్యంలో కూర గాయలు సాగు చేసి నష్టాలను పూరించుకునే అవకాశం ఉంది. శీతాకాలం ప్రారంభ మయ్యే అక్టోబరు. నవంబరు నెలలు కూరగాయల సాగుకు అనుకూలమైన కాలం. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
- వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే మేలు
బెజ్జూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయ లు. ప్రణాళికాబద్ధంగా దఫ దఫాలుగా వివిధ రకాల కూరగాయల పంటలను విత్తుకుంటూ ఉం డాలి. దీంతో ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ ప్రతీ రోజు అనేక రకాల కూరగాయలు చేతికి అందివస్తాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కార ణంగా భవిష్యత్తులో పంటలు, పప్పు ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడనున్న నేపథ్యంలో కూర గాయలు సాగు చేసి నష్టాలను పూరించుకునే అవకాశం ఉంది. శీతాకాలం ప్రారంభ మయ్యే అక్టోబరు. నవంబరు నెలలు కూరగాయల సాగుకు అనుకూలమైన కాలం. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటోంది. దీంతో కూరగాయల పంటలకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో స్వల్పకాలిక పంటలను సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా 40నుంచి 60 రోజుల్లో కోతకు వచ్చే ఆకు కూరలు, ముల్లంగి, బీట్రూట్, బీన్స్, బఠాణి లేదా క్యాబేజీ, కాలీప్లవర్ వంటి పంటలను స్థానిక మార్కెట్ డిమాండ్‌కు అనుగు ణంగా ఎంచుకుంటే ఆదాయం ఉంటుందని కాగజ్ నగర్ డివిజన్ ఉద్యాన అధికారి సుప్రజ చెబుతున్నారు.
- ఆకుకూరలకు..
తక్కువ భూ విస్తీర్ణం కలిగిన రైతులకు, ఆకుకూరలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర వంటి పంటలకు విత్తన ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు స్వల్పకాలంలోనే కోతకు వస్తాయి. ఒకేసారి పంట వేయడం కంటే దశల వారీగా సాగు చేస్తే మేలు. ఒకేసారి పెద్ద మొత్తంలో పంట మార్కెట్‌కు వస్తే ధర పడిపోయే అవకాశం ఉంటుంది. కాగా కూరగాయల సాగులో అధిక దిగుబడి కంటే మార్కెట్ డిమాండ్, విక్రయ ధర కూడా ఎంతో కీలకం. ఒక గ్రామంలో లేదా మండలంలో ఇప్పటికే అధికంగా సాగవుతున్న పంటను పెద్ద విస్తీర్ణంలో సాగు చేయడానికి ముందు స్థానిక మార్కెట్ పరిస్థితిని తెలుసుకోవాలి. సాగుకు ముందే రైతు బజార్, మార్కెట్ యార్డు, హోల్‌సేల్ వ్యాపారులు, కూరగాయల దుకాణదారుల డిమాండ్‌పై సమాచారం సేకరించడం మంచిది. వీలైతే వినియో గదారులకు నేరుగా విక్రయించి మధ్యవర్తులపై ఆధారపడటం తగ్గించవచ్చు.
- ఒకే పంటపై ఆధారపడకుండా..
ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందే వరకు, 2-4స్వల్పకాలిక కూరగాయలను కలిపి సాగు చేయాలి. ఒక భాగంలో ఆకుకూరలు, మరో భాగంలో ముల్లంగి, ఇంకో భాగంలో బీన్స్ లేదా స్థానికంగా డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేయాలి. ఇలా చేస్తే పంటల కోత సమయాలు కూడా కొంత విభిన్నంగా ఉండి, రైతుకు నిరంతర నగదు ప్రవాహం లభించే అవకాశం ఉంది. స్వల్ప కాలిక కూరగాయలతో పంట కాలం తక్కువగా ఉండఛిం వల్ల ప్రారంభ దశ నుంచే సరైన యాజ మాన్యం అవసరం. విత్తే ముందు నేల పరీక్ష చేయించుకొని అవసరానికి అనుగుణంగా ఎరువుల ను వాడటం వల్ల కొన్ని కూరగాయల్లో నాణ్యత తగ్గే అవకాశం ఉంది. నీరు నిల్వ ఉండకుండా సమతుల్య నీటి యాజమాన్యం, అవసరమైన చోట డ్రిప్ లేదా స్ర్పింక్లర్ పద్ద్ధతులు, కలుపు నివారణ, సకాలంలో పురుగు, తెగుళ్ల పరిశీలన చేపట్టాలి. రసాయన మందులను అధికారుల సూచనల మేరకు వినియోగించడం ఉత్తమం.
డిమాండ్ మేరకు సాగు చేయాలి..
- సుప్రజ, కాగజ్‌నగర్ డివిజన్ ఉద్యాన అధికారి
రైతులు డిమాండ్, మార్కెట్ అంచనాలను తెలు సుకొని ముందుకు వెళితే స్వల్పకాలిక కూరగాయల సాగు రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఇష్టానుసారంగా కాకుండా ఉద్యాన అధికారులను సంప్రదించి పురుగుల మందు వాడాలి. దీంతో ఖర్చు తగ్గించు కోవడంతో పాటు పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదే విధంగా ప్రభుత్వం సాగుకు అందించే వివిధ రాయితీలు పొంది ఆర్థికంగా ఎదగాలి. డిమాండ్ మేరకే కూరగాయలు సాగుచేసి నట్లయితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.