Share News

బాధితులకు భరోసా కల్పించాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:59 PM

పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసు సిబ్బంది భరోసా కల్పించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ అన్నారు. శనివారం దండేపల్లి పోలీసుస్టేషన్‌ను ఆయన సందర్శించారు.

 బాధితులకు భరోసా కల్పించాలి
దండేపల్లి పోలీసుస్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఠూ

రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఠూ

దండేపల్లి జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసు సిబ్బంది భరోసా కల్పించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ అన్నారు. శనివారం దండేపల్లి పోలీసుస్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్బంగా స్టేషన్‌ పరిసర ప్రాంతాలను పరిశీ లించి ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రైమ్‌ వాహనాలు, ప్రాపర్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందుగా పోలీసుస్టేషన్‌లో రిసెప్షన్‌, ఐటి విభాగం ఇతర పోలీసు సిబ్బంది పనితీరును ఆయన నేరుగా సమీక్షించారు. స్థానిక ఎస్సై రాజావర్థన్‌ను స్టేషన్‌ నిర్వహణ, రికార్డులు, కేసుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ తనిఖీ చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై ఆరా తీశారు. సీపీ మాట్లాడుతూ 5ఎస్‌ విధా నాన్ని అమలు చేస్తూ పోలీసుస్టేషన్‌ను వర్టికల్‌ వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని ఏస్సైకి సూచించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన ఆ హ్లాదకరమైప వాతావరణం కల్పించాలన్నారు. క్రైమ్‌ ప్రాపర్టీ విషయంలో అప్రమత్తంగా ఉండా లన్నారు. పోలీసుస్టేషన్‌లో రికార్డులను ఎప్నటికప్పుడు సమీకరించాలన్నారు. ఎలాంటి కేసులు పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. చట్టవ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి వారిపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా వేగంగా జరగాలన్నారు. ఆయన వెంట దండేపల్లి ఎస్సై రాజావర్థన్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:00 AM