Share News

kumaram bheem asifabad-అన్నదాతకు భరోసా

ABN , Publish Date - Jun 28 , 2026 | 10:11 PM

రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా సొమ్మును ఈనెల 30న అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంటల సాగుకు ఉపయోగపడేందుకు రైతుభరోసా పేరుతో ప్రభుత్వం పెట్టుబడి సాయా న్ని అందిస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతుబంధు పేరుతో ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చిన తర్వాత రైతుభరోసాగా పేరు మార్చారు. గతంలో దాదాపుగా సీజన్‌ ఆరంభానికే పెట్టుబడి సాయం అందగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం సరిగ్గా అందలేదు. ఆర్థికంగా ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా రైతుభ రోసాను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేకపోతుం దన్న చర్చ సాగుతోంది.

kumaram bheem asifabad-అన్నదాతకు భరోసా
లోగో

- ముమ్మరంగా వానాకాలం సాగు పనులు

- జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో పంటలు వేసే అవకాశం

- రైతులకు పెరిగిన పెట్టుబడి ఖర్చులు

బెజ్జూరు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా సొమ్మును ఈనెల 30న అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంటల సాగుకు ఉపయోగపడేందుకు రైతుభరోసా పేరుతో ప్రభుత్వం పెట్టుబడి సాయా న్ని అందిస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతుబంధు పేరుతో ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చిన తర్వాత రైతుభరోసాగా పేరు మార్చారు. గతంలో దాదాపుగా సీజన్‌ ఆరంభానికే పెట్టుబడి సాయం అందగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం సరిగ్గా అందలేదు. ఆర్థికంగా ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా రైతుభ రోసాను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేకపోతుం దన్న చర్చ సాగుతోంది. కాగా పలు సీజన్లకు రైతు భరోసాను మొత్తానికి ఇవ్వకపోగా గత యాసంగి సీజన్‌లో కేవలం రెండు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా సొమ్మును అందించారు. ఈ వానాకా లం సీజన్‌కు మాత్రం పూర్తి విస్తీర్ణానికి రైతు భ రోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

- జిల్లా వ్యాప్తంగా..

ఈ వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమా రు 4.50లక్షల ఎకరాల్లో వివిద పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 43వేలకు పైగా రైతులు ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగా అన్ని మండలాల్లో విత్తనాలు, ఎరువులు సరిపడా నిల్వలు ఉంచామని అధికారులు చెబుతున్నారు. కాగా గత వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6వేల చొప్పున అందించింది. గత యాసంగి నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం సీజన్‌కు ఎకరాకు ఏడున్నర వేలు ఇవ్వాల్సి ఉండగా నిధులు లేమితో పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.6వేలు మాత్రమే అందిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున అందించింది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు విడతల్లో రూ.15వేలు ఇస్తామని హామీ ఇవ్వగా కేవలం రెండు సీజన్లకు రూ.12వేలు మాత్రమే చెల్లిస్తోంది. ఏటేటా రైతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జిల్లాలో సాగులో ఉన్న భూముల సంఖ్య యధావిధిగానే ఉంటుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో లోపాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొద్దిమందికి రైతుభరోసా అంద లేదు. మిగితా వారికి మాత్రం రైతుభరోసా జమ అవుతుంది.

- తడిసి మోపెడవుతున్న పెట్టుబడులు..

ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడుల ఆశతో హైబ్రీడ్‌ విత్తనాల కోసం రైతులు భారీగా ఖర్చు చేస్తున్నారు. దుక్కులు దున్నడం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు మందులు, నాట్లు ఇలా అన్ని కలిపి ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు అవుతోంది. ప్రైవేటు వ్యాపారులు ఆశ్రయించకుండా ప్రభుత్వ సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పినా నిధులు సర్దుబాటు కారణంగా దానిని రూ.12వేలకే పరిమితం చేసింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగగా, దీనికితోడు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఈ భారమంతా రైతులపైనే పడుతోంది. ఇక కౌలు ధరలు, కూలీ రేట్లు, సాగుకు ఉపయోగించే యంత్రాలైన ట్రాక్టర్ల ధరలు కూడా అమాంతం పెరిగి పెట్టుబడి ఖర్చు లు తడిసిమోపెడవుతున్నాయని రైతులు వాపోతు న్నారు. ఇక ప్రభుత్వం అందించే పెట్టుబడి సా యం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా ఎకరం, రెండెకరాలకే ఇస్తుండడం మూలంగా సాగు భారంగా మారుతోందని రైతులు వాపోతున్నారు.

- మార్పులు ఉండే అవకాశం..

రైతుభరోసా పథకంలో ఈసారి స్వల్ప మార్పు లు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో విడతల వారీగా, ఎకరాల వారీగా డబ్బులు జమ చేయగా, ఈ సీజన్‌లో ఒకేసారి ఖాతాల్లో వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాగా రైతులకు ఉన్న భూమి మొత్తానికి రైతుభరోసా ఇస్తారా? కటాఫ్‌ పెడతారా అన్నది తేలాల్సి ఉంది. కేవలం ఏడున్నర ఎకరాల వరకు మాత్రమే రైతుభరోసా ఇస్తారన్న చర్చ జరుగుతోంది. చిన్న, సన్నకారు రైతులకు రైతుభరోసా అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈక్రమంలో ఆ వర్గాల వారికే రైతుభరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏడున్నర ఎకరాలను కటాఫ్‌గా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అదే విధంగా భూములు ఉన్న అందరు రైతులకు కాకుండా కేవలం పంటలు సాగు చేసిన రైతులకే రైతుభరోసా ఇవ్వాలన్న ఆలోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై కూడా స్పష్టత రావా ల్సి ఉంది. మరోవైపు ఈసారి 10ఎకరాల వరకు రైతుభరోసా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్తగా పట్టాలు వచ్చిన రైతులు కూడా రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈసారి సాగు సీజన్‌ ఆరంభం లోనే పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో రైతులకు ఉప యుక్తంగా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Updated Date - Jun 28 , 2026 | 10:11 PM