Share News

రియల్‌ దాహం...ప్రజలకు శాపం

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:43 PM

రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారుల దనదాహం ప్రజలకు శాపంగా పరిణ మించింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా భూముల దందా చేస్తున్న కొందరు వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

రియల్‌ దాహం...ప్రజలకు శాపం

-బఫర్‌ జోన్లలో నిర్మితమవుతున్న ఇళ్లు

-వాగులు, వంకలనూ వదలని రియల్టర్లు

-ఆమోదయోగ్యంకాని స్థలాల్లో నిర్మాణాలు

-నిలువునా మునుగుతున్న పాట్ల కొనుగోలుదారులు

మంచిర్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారుల దనదాహం ప్రజలకు శాపంగా పరిణ మించింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా భూముల దందా చేస్తున్న కొందరు వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొనుగోలుదారు నష్టపోయినా పర వాలేదు...తన ఖజానా నిండితే చాలనుకుంటున్న రియ ల్‌ వ్యాపారులు ఇళ్ల నిర్మాణాలకు ఆమోదయోగ్యంకాని స్థలాలను అంటగడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి, ఇళ్లు నీటమునగడంతో కొ నుగోలుదార్లు నిలువునా మోసపోతున్నారు. మునిసిప ల్‌ కార్పొరేషన్‌తోపాటు పరిసర ప్రాంతాల పరిధిలోని వాగుల సమీపంలో కొనుగోలు చేసిన ప్లాట్లలో నిర్మిం చిన ఇళ్లు గతేడాది కురిసిన వర్షాలకు నీట మునగగా, ప్రతిసారీ వర్షాకాలంలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బఫర్‌ జో న్లను కబ్జాచేసి అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి, అమా యకులకు ప్లాట్లు అంటగడుతుండగా, ఆయా స్థలాల్లో నిర్మితమవుతున్న ఇళ్లకు మున్సిపాలిటీలు, పంచాయ తీల నుంచి అనుమతులు ఇవ్వడం గమనార్హం.

బఫర్‌ జోన్లలో వందలాది నిర్మాణాలు...

జిల్లా కేంధ్రంతోపాటు వివిధ మున్సిపాలిటీలు, మే జర్‌ గ్రామ పంచాయతీలలో నదులు, వాగులు, నాలా ల బఫర్‌ జోన్లలో వందలాది నిర్మాణాలు జరిగాయి. మంచిర్యాల నగరంలోని రాళ్లవాగు, తోళ్లవాగు బఫర్‌ జోన్లలో పెద్ద మొత్తంలో నిర్మాణాలు ఇప్పటికే జరుగ గా, వాటిలో ఎక్కువభాగం నిర్మాణాలకు మున్సిపల్‌ అ నుమతులు ఉన్నాయి. అలాగే నగరంలోని శ్రీనివాస గార్డెన్‌ సమీపంలోని నాలాలను కబ్జాచేయగా, ఆయా స్థలాల్లో పదుల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి. నా లాలను ఆక్రమిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అం దులో మట్టిపోసి, సన్నగా మార్చుతున్న అడిగేవారు లేరు. ఆ స్థలంలో ఏర్పాటు చేసిన ప్లాట్లను విక్రయిం చగా, ప్రస్తుతం నిర్మాణాలు ఉన్నాయి. నాలాలు, బఫర్‌ జోన్ల కబ్జాల కారణంగా అవి కుచించుకుపోయి, వరద ల సమయంలో తీవ్రరూపం దాల్చుతుండటంతో ఊ హించని నష్టం వాటిల్లుతోంది. అలాగే ఎల్‌ఐసీ కాలనీ, ఎన్టీఆర్‌ నగర్‌తోపాటు రాళ్లవాగు, తోళ్లవాగు పరిసర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు వర్షాలకు తరుచుగా నీట మునగడానికి ప్రధాన కారణం బఫర్‌ జోన్లలో నిర్మిం చడమేనని తెలుస్తోంది. నస్పూర్‌లోని తోళ్లవాగు పరిస ర ప్రాంతమైన వినూత్న కాలనీ పరిస్థితి కూడా అ లాగే ఉంది. మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలోని వేం పల్లి గ్రామంలో బహుళ అంతస్థుల భవనాలు అనేకం నీట మునిగాయి. ఇందులోనూ వాగు పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు అనేకం ఉన్నాయి.

గుళ్ల పేరుతో కబ్జాలు....

వాగులు, నాలాల భూములను కబ్జా చేస్తున్న కొం దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటిని స్వాధీనం చే సుకునేందుకు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా రు. గుళ్ల పేరుతో బఫర్‌ జోన్లలో గుట్టుచప్పుడు కాకుం డా స్థలాలను చదునుచేసి, హద్దులు ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో రాళ్లవాగు, తోళ్లవాగు బఫర్‌ జోన్లు గుళ్ల పేరిట పెద్ద ఎత్తున అ న్యాక్రాంతం కాగా, సాయికుంట చెరువు బఫర్‌ జోన్‌ల లోనూ అదే పరిస్థితి నెలకొంది. అలాగే శ్రీనివాస గా ర్డెన్‌ సమీపంలోని 324 సర్వే నెంబరులోనూ నాలా ఒ డ్డున ఓ గుడి వెలిసింది. మరోవైపు చెరువు శిఖం భూ ముల్లోనూ గుళ్లు నిర్మించడం గమనార్హం. హైటెక్‌ సిటీ సమీపంలోగల చీకటి వెలుగుల కుంట చెరువు శిఖలో నూ ఓ గుడి నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తూ అక్రమ ని ర్మాణాలను కూల్చివేస్తున్నప్పటికీ బడా బాబుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాళ్లవాగు బఫర్‌ జోన్‌ పరిధిలో బహుళ అంతస్థుల భవనాలు వెలిసి నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అలా వాగు ఒడ్డున నిర్మించిన వా టిలో అనేక భవనాలు గతంలో వరదల్లో ముని గిపోయాయి.

మోసపోతున్న ప్రజానీకం....

వాగులు, నాలాల సమీపంలో ఇళ్ల స్థలాలు కొనుగో లు చేస్తున్న సామాన్య ప్రజానీకం, అవి బఫర్‌ జోన్లలో ఉన్నాయో...లేవో పరిశీలించకపోవడంతో నిలువు దోపి డీకి గురవుతున్నారు. మంచిర్యాల నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ ఇళ్ల స్థలాల ధర లు ఆకాశాన్నంటుతున్నాయి. నాలాలు, వాగుల సమీ పంలోనూ కనీస ధర గజం ఒక్కంటికి రూ. 15వేల పై చిలుకు పలుకుతోంది. ప్రధాన ఏరియాలతో పోలిస్తే ధర తక్కువ ఉండటంతో వాగుల సమీపంలో స్థలాలు కొనుగోలు చేసేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవు తోంది. వారి అవసరాన్ని ఆసరగా తీసుకుంటున్న వ్యా పారులు బఫర్‌ జోన్లు, శిఖం భూములు అంటగడు తున్నారు. ఆ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇ స్తున్న మున్సిపాలిటీలు, పంచాయతీలు నిబంధనలను గాలికి వదిలివేస్తున్నాయి. పలుకుబడి, పైరవీలకు త లొగ్గుతున్న అధికారులు శిఖం, బఫర్‌ జోన్లలోనూ ని ర్మాణ అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంబంధిత ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నది.

Updated Date - Jul 05 , 2026 | 11:43 PM