Share News

ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:34 PM

యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చే సేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. జి ల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా రు.

ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం

2 లక్షల పై చిలుకు మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

-319 సెంటర్ల ప్రారంభానికి సన్నాహాలు

-కేంద్రాల వద్ద రైతులకు మౌలిక సదుపాయాలు

-యాసంగిలోనూ సన్నాలకు రూ. 500 బోనస్‌

-మద్దతు ధరలపైనే రైతుల పెదవి విరుపు

మంచిర్యాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చే సేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. జి ల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా రు. గతంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కా వడంతో వర్షాలు పడి రైతులకు తీరని నష్టం వాటిల్లిం ది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అఽధికారులు ముందస్తు గా చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గణనీయంగా తగ్గిన సన్నరకం సాగు...

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రబీ సీజన్‌లో సన్న రకం వరి సాగు జిల్లాలో గణనీయంగా తగ్గింది. ఈ సీజన్‌లో జిల్లాలో లక్షా 18 వేల 437 ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో దొడ్డు రకం ఒక లక్షా 16వేల 768 ఎకరాలుకాగా, సన్నరకం కేవలం 1669 ఎకరాల్లోనే సాగైంది. గత ఏడాది లక్షా 21వేల 702 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, ఇందులో దొడ్డు రకం ఒక లక్షా 14 వేల 774 ఎకరాలు, సన్నరకం 6928 ఎకరాల్లో సాగైం ది. గత సీజన్‌తో పోలిస్తే ఏకంగా 5,259 ఎకరాల సా గు ఈ సీజన్‌లో తగ్గింది. గత సీజన్‌లో 3 లక్షల 40 వేల301 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచ నా వేయగా, ప్రస్తుతం 2లక్షల 95వేల 759 మెట్రిక్‌ ట న్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇం దులో దొడ్డు రకం 2 లక్షల 91వేల 920 మెట్రిక్‌ టన్ను లు, సన్నరకం ధాన్యం 3839 మెట్రిక్‌ టన్నులు దిగుబ డి వస్తుందని భావిస్తున్నారు. కొంతమంది మిల్లరు నే రుగా ధాన్యం సేకరించే అవకాశం ఉండటంతో కొను గోళ్ల లక్ష్యం కొంతమేర తగ్గుతుందనే అభిప్రాయంలో అధికారులు ఉన్నారు.

బోనస్‌ ఇస్తున్నా దొడ్డు రకం వైపే మొగ్గు....

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతు లకు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ప్రకటిం చింది. 2023-24 సీజన్‌ నుంచి ప్రారంభమైన బోనస్‌ చెల్లింపులు ఈ యాసంగి సీజన్‌లోనూ కొనసాగించ నున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ స న్నరకం వరి సాగు విస్తీర్ణం తగ్గిపోవడం గమనార్హం. రబీ సీజన్‌లో గింజ విరిగిపోయే అవకాశం ఉండటంతో రైతులు దొడ్డు రకం సాగుపైనే ఆసక్తి కనబరిచినట్లు తె లుస్తోంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన మేరకు ధాన్యం గ్రేడ్‌-ఏ రకం క్వింటాకు రూ. 2389 కనీస మద్దతు ధర ఉండగా, కామన్‌ గ్రేడ్‌ రకం రూ. 2369 ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాలకు బో నస్‌ రూ. 500 చెల్లించనుండటంతో క్వింటాకు రూ. 2889 ధర గిట్టుబాటు కానుంది. గత ఏడాది మద్దతు క్వింటాకు రూ. 2300 ఉండగా, ఈ ఏడాది సగటున రూ. 70 వరకు అదనంగా ధర లభించనుంది.

319 కేంద్రాల ఏర్పాటుకు...

యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు సంబం ధించి జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేం దుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. డీ ఆర్‌ డీఏ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధా నంలో ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు. ఈ మేరకు సెంటర్‌ నిర్వాహకులకు అవసరమైన శిక్షణ పూర్తి చేశా రు. అలాగే లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కోసం మొత్తం 55 లక్షల గన్నీ సంచులు పూర్తిస్థాయిలో అం దుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తు న్నా రు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం మౌలిక స దుపాయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి తరలిపునకు చెక్‌...

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల కు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ధాన్యం తరలింపు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. కేవ లం జిల్లా రైతులు పండించిన ధాన్యాన్నే కొనుగోలు కేం ద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల సిబ్బంది సమన్వయంతో జిల్లాలోకి వచ్చే అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయను న్నారు. చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ చేప ట్టాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి అసౌకర్యా నికి గురికాకుండా అవసరమైన చర్యలు చేపట్టే యో చనలో అధికార యంత్రాం ఉంది.

మద్దతు ధరలపై రైతుల పెదవి విరుపు....

కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా యా సంగి సీజన్‌లో ధాన్యం మద్దతు ధరలపై రైతులు పె దవి విరుస్తున్నారు. కేంద్రం ప్రకటించిన మేరకు వరి పంటకు మద్దతు ధర క్వింటాకు గ్రేడ్‌-ఏ రకం రూ. 2,389 ఉండగా, కామన్‌ వెరైటీ ధర రూ. 2,369 ఉంది. గత ఏడాది క్వింటాలుపై సగటున రూ. 117 చొప్పున ధరలు పెరిగాయి. ప్రస్తుతం కేవలం రూ. 69 పెంచ డం పట్ల రైతులు అయిష్టతను ప్రదర్శిస్తున్నారు. అయి తే వరిసాగు చేసేందుకు ఎకరాకు సుమారు రూ. 25 వేల వరకు ఖర్చు వస్తుందని, సాగు ఖర్చులకు అను గుణంగా మరికొంత మద్దతు ధర పెంచాల్సిందనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిగుబడిలో తాలు, త ప్ప, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంపోనూ పెద్ద గా చేతికి వచ్చేది ఏమీలేదనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. దొడ్డు రకానికి రూ. 2800 వరకు ధర చె ల్లిస్తే కొంతలో కొంత గిట్టుబాటయ్యేదని రైతులు చెబుతున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 10:34 PM