Share News

బ్రేక్‌ ఫాస్ట్‌ సేవలకు సిద్ధం ...

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:51 PM

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ’’సెంట్ర లైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌’’ (కేంద్రీకృత వంటశాల) పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

బ్రేక్‌ ఫాస్ట్‌ సేవలకు సిద్ధం ...

-నేడు ‘సెంట్రలైజ్డ్‌ కిచెన్‌’ ప్రారంభించనున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

-అధునాతన టెక్నాలజీగల ఆటోమేటెడ్‌ యం త్రాల బిగింపు

-ప్రతిరోజూ 50వేల మందికి అందనున్న ఆహారం

-హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో ఏర్పాటు

-రూ. 8 కోట్ల సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయింపు

మంచిర్యాల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ’’సెంట్ర లైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌’’ (కేంద్రీకృత వంటశాల) పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అన్ని హంగులు, అధునాతన టెక్నాలజీ, ఆటోమేటెడ్‌ యంత్రాలతో కూడిన ’సెంట్రలైజ్డ్‌ కిచెన్‌’ ను ఈ నెల 31వ తేదీన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విడివిడిగా వంట చేయడం కాకుండా, ఒక పెద్ద ఆధునిక వంటశా లలో వేలాది మంది విద్యార్థులకు ఒకేసారి భో జనం తయారు చేసి, ప్రత్యేక వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేసే ఉద్దేశ్యంతో రేవంత్‌ సర్కారు ’’సెంట్రలైజ్డ్‌ కిచెన్‌’’లను తెరపైకి తె చ్చింది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశా లల విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారంతోపాటు జూనియర్‌ కళాశా లల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సమ కూర్చనున్నారు. ఇక్కడ తయారు చేసిన వంట లను గరిష్టంగా మూడు గంటల వరకు వేడిగా ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్ల మధ్యలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు, కళాశాలలకు భోజన సమయం వరకు అందజేసే విధంగా అ వసరమైన చర్యలు తీసుకోనున్నారు.

రూ. 8 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయింపు....

జిల్లా కేంధ్రంలోని పాత అగ్రికల్చరల్‌ మార్కె టింగ్‌ యార్డు ఆవరణలో జోనల్‌ కార్యాలయం ఏర్పాటు చేయగా, సింగరేణి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులు రూ. 8 కోట్లతో చేపట్టిన ’’సెంట్రలైజ్డ్‌ కిచెన్‌’’ రూపుది ద్దుకుంది. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ (హెచ్‌కేఎంసీఎఫ్‌) భాగస్వామ్యంలో వంటల తయారీ, మెనూ మొదలుకొని ఆయా పాఠశాలలు, కళాశాలలకు తరలించడం వరకు హెచ్‌కేఎంసీఎఫ్‌ బాధ్యతలు నిర్వర్తించనుంది. భోజనం తరలించేందుకు అవసరమైన వాహ నాలు, సిబ్బందిని కూడా సంస్థనే సమకూర్చుకోనుంది.

జిల్లాలో 50వేల మందికి లబ్ది....

రేవంత్‌ సర్కారు నిర్ణయంతో మంచిర్యాల ’’సెంట్రలైజ్డ్‌ కిచెన్‌’’ ద్వారా 50వేల మంది వి ద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయను న్నారు. సుమారు 45 వేల మందికి ఉదయం ఆల్పాహారం అందజేయనుండగా, ఐదు వేల పై చిలుకు మందికి అడ్మిషన్ల సంఖ్యను భట్టి మ ధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. ’’సెంట్రలైజ్డ్‌ కి చెన్‌’’ ద్వారా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలలోని 17 మండలాల పరిధిలో 691 ప్ర భుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మం ది పాఠశాలల విద్యార్థులతోపాటు 13 జూని యర్‌ కాలేజీలో చదువుతున్న 6,654 మంది వి ద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమై న, పోషకవిలువలతో కూడిన అల్పాహారం అం దించనున్నారు. భద్రతా ప్రమాణాలను అత్యు న్నత స్థాయిలో నిర్వహించేందుకు ఫుడ్‌ ల్యాబ్‌, మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ వంటి సదుపా యాలను కల్పించారు. మంచిర్యాల కిచెన్‌కు పె ద్దపల్లి జిల్లాలోని అంతర్గాం, రామగుండం, పె ద్దపల్లి, పాలకుర్తి మండలాల్లోని ప్రభుత్వ పాఠ శాలలు, కళాశాలలను అనుసంధానం చేయగా, మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి, భీమిని, తాం డూరు మండలాలను సమీప పొరుగు జిల్లా అయిన కొమరంభీం ఆసిఫాబాద్‌లోని కాగజ్‌న గర్‌ ’’కిచెన్‌’’కు అటాచ్‌ చేశారు. అలాగే జగిత్యా ల జిల్లాలోని వెల్గటూరు, ఎండపల్లి మండలాల ను మంచిర్యాలకు అటాచ్‌ చేశారు. దూరభారం తగ్గించే క్రమంలో వివిధ మండలాలను పొరు గు జిల్లాలకు అటాచ్‌ చేయడం ద్వారా సకాలం లో విద్యార్థులకు భోజనం అందించే చర్యలు చేపడుతున్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో...

మంచిర్యాలలో 8వేల చదరపు అడగుల మేర నిర్మించిన షెడ్డులో సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు చేయగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వంట సామగ్రి, యంత్రా లను భిగించారు. ఆటోమేటెడ్‌ స్టీమర్ల సహా యంతో గంటకు 5600 ఇడ్లీలు, ఆటోమేటిక్‌ దో శ మెషీన్‌తో 2వేల దోశలు, 3,600 పూరీలు, సాంబార్‌, కూరల తయారీ యూనిట్ల ద్వారా రెండు గంటల్లో 5వేల మందికి సరిపడా ఆహా రం తయారు చేయనున్నారు. రైస్‌ కుకింగ్‌ పరి కరాల ద్వారా కేవలం 40 నిమిషాల్లో వెయ్యి మందికి సరపడా అన్నం తయారు చేయగల సామర్థ్యం ఉంది. అలాగే ఆటోమేటిక్‌ వెజిటే బుల్‌ వాషింగ్‌ అండ్‌ కటింగ్‌ యూనిట్‌, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, బాయిలర్‌ ప్లాంట్‌, సెంట్రల్‌ గ్యాస్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఇని స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సూచనల మేరకు మెనూ రూపొందించగా, విద్యార్థులకు సమతు ల్యమైన, పోషక విలువలతో కూడి ఆహారం అందించనున్నారు.

మెనూ ఇలా....

సోమవారం... ఇడ్లీ- సాంబారు

మంగళవారం.... పూరీ- ఆలూ కుర్మా

బుధవారం... దోశ- చట్నీ

గురువారం... ఉప్మా- చట్నీ

శుక్రవారం... మిల్లెట్‌ ఇడ్లీ- సాంబారు

శనివారం... బోండా- చట్నీ

వాటితోపాటు వేడి పాలు, రాగి జావ రోజుకొకటి చొప్పున భోజనంలో భాగంగా అందజేయనున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 11:51 PM