Minister Komatireddy Venkat Reddy: ఆర్ అండ్ బీ శాఖ నా కుటుంబంలాంటిది
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:38 AM
రోడ్లు, భవనాల శాఖ తనకు కుటుంబం వంటిదని, ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సమానమని, తనను కలిసేందుకు ఉద్యోగులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని.....
ఉద్యోగులు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, జనవరి 1(ఆంధ్ర జ్యోతి): రోడ్లు, భవనాల శాఖ తనకు కుటుంబం వంటిదని, ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సమానమని, తనను కలిసేందుకు ఉద్యోగులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏ సమయంలో అయినా తనను కలవచ్చని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఎర్రమంజిల్‌లోని శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్ అండ్ బీ శాఖ 2026 సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజునే అన్ని వివరాలతో డైరీ ఆవిష్కరణ చేయడం తొలిసారి అని అధికారులకు కితాబిచ్చారు.