పరవస్తు లోకేశ్వర్‌కు రావూరి భరద్వాజ స్మారక పురస్కారం
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:30 AM
చరిత్ర పరిశోధకుడు, రచయిత పరవస్తు లోకేశ్వర్‌ను 2026 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికైనట్లు..
రావూరి కాంతమ్మ అవార్డుకు హరిప్రియ ఎంపిక
హైదరాబాద్ సిటీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): చరిత్ర పరిశోధకుడు, రచయిత పరవస్తు లోకేశ్వర్‌ను 2026 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికైనట్లు రావురి భరద్వాజ్- కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకుడు కోటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవల, కథ, యాత్రా రచనల్లో లోకేశ్వర్ కృషికిగాను ఈ అవార్డును అందిస్తున్నట్లు చెప్పారు. రావూరి కాంతమ్మ సేవా పురస్కారానికి హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు హరిప్రియ ఎంపికయ్యారు. రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా ఈ నెల 5న చిక్కడపల్లి త్యాగరాయ గానసభ వేదికగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.