kumaram bheem asifabad- ఇక ‘స్మార్ట్’గా రేషన్
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:39 PM
ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్‌గా మారు తోంది. రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే శుభ వార్త చెప్పింది. సుమారు 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- నేటి నుంచి అందజేసేలా అధికారుల కసరత్తు
- అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకేనని సర్కార్ స్పష్టత
చింతలమానేపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్‌గా మారు తోంది. రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే శుభ వార్త చెప్పింది. సుమారు 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు ఇప్పటికే జిల్లా పౌరశాఖకు చేరినట్టు సమాచారం. జిల్లాలో అన్ని రకాలుగా 1,65,456 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 5,.45,182 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో అంత్యోదయ పథకం కార్డులు 20 ఉండగా, 20 మంది లబ్ధిదారులున్నారు. 280 రేషన్ దుకాణాలు న్నాయి. ప్రభుత్వం నుంచి తుది మార్గదర్శకాలు అందగానే పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఇప్పటి వరకు కాగితంపై..
ఇప్పటి వరకు కాగితంపై ఉన్న రేషన్ కార్డులకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డుల ను రూపొందించింది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ డిజిటల్ కార్డును చినిగిపోకుండా, తడిసి పోకుండా, నాణ్యమైన భద్రత ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుపై కుటుంబ యాజమాని, కుటుంబ సభ్యుల పేర్లతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో ప్రత్యేకంగా క్యూఆర్ కోర్డును పొందుప రిచారు. రేషన్ దుకాణాల్లో కార్డును స్కాన్ చేయ గానే కుటుంబానికి సంబంఽధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ స్మార్ట్ కార్డును ఇతర బహుళ ప్రయోజనాలకు కూ డా ఉపయోగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారుల చెబుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులు అందంచే అవకాశం ఉంది. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా మార్గదర్శకాలు రావాల్సి ఉంది. మార్గదర్శకాలు అందిన వెంటనే కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు, నియోజకవర్గాలు, మండలాల వారీగా పంపిణీ షెడ్యూలు రూపొందించనున్నారు. ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వం నుంచి మార్గద ర్శకాలు రాగానే కలెక్టర్ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకేనని సర్కార్ స్పష్టత నిచ్చింది.