Share News

kumaram bheem asifabad- రేషన్‌ ఈ- కేవైసీ తప్పనిసరి

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:20 PM

రేషన్‌ లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబరు నెలాఖరు వరకు గడువు పొడగించింది. జిల్లాలో 20 శాతం మంది ఈకైవేసీ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మూడు నెలల బియ్యం కోటా పంపిణీ పూర్తి అయింది. రేషన్‌ దుకాణాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే మోబైల్‌ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకునేలా ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. పూర్తయిందో లేదో తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను

kumaram bheem asifabad- రేషన్‌ ఈ- కేవైసీ తప్పనిసరి
లోగో

- అక్టోబరు నెలాఖరు వరకు గడువు

పెంచికల్‌పేట్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబరు నెలాఖరు వరకు గడువు పొడగించింది. జిల్లాలో 20 శాతం మంది ఈకైవేసీ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మూడు నెలల బియ్యం కోటా పంపిణీ పూర్తి అయింది. రేషన్‌ దుకాణాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే మోబైల్‌ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకునేలా ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. పూర్తయిందో లేదో తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. లబ్ధిదారులకు కొంచెం అవగాహణ ఉంటే ఈ ప్రక్రియ సులువుగా పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ఓటీపీ ద్వారా..:

ముందుగా మొబైల్‌లో పేస్టోర్‌ నుంచి మేరా ఈకేవైసీ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్‌ పేస్‌ ఆర్డి యాప్‌ను ఓపెన్‌ చేసి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఆధార్‌ నంబర్‌, క్యాప్చను ఎంటర్‌ చేయాలి. వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫైచేసుకొని ఆధార్‌ యాప్‌లో లబ్ధిదారుల ఫోటో వెరిఫికేషన్‌ పూర్తి చేస్తే ఈ- కైవేసి ప్రక్రియ పూర్తియినట్లు సందేశం వస్తోంది. పౌరసరఫరాల శాఖ వారి లింక్‌ను ఉపయోగించి రేషన్‌ కార్డు నెంబరు, క్యాప్చను నమోదు చేస్తే కుటుంబీకుల వివరాలు కన్పిస్తాయి. పేర్ల పక్కన యాక్టివ్‌ అని కన్పిస్తే ఈ కేవైసీ అయినట్టు, ఒక వేళ ఇన్‌ యాక్టివ్‌గా ఉంటే ఈ- కేవైసీ కానట్టు భావించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇంకా 20 శాతం ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంది. గత మూడు నెలల నుంచి ఎన్‌ఫోర్సుమెంటు శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. అర్హులకు రేషన్‌ బియ్యం అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రక్రియను చేపడు తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. రేషన్‌ చౌక దుకా ణాల వద్దకు పోకుండా ఇంటి వద్దనే ఆన్‌లైన్‌ ద్వారా వెలుసు బాటు చేసుకునేందుకు మోబైల్‌ యాప్‌ ద్వారా అవకాశం ఇవ్వడంతో అంతా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:20 PM