Share News

రేషన్‌కార్డులపై సీఎం ఫొటో అవసరమా?

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:04 AM

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్‌కార్డులపై ‘సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల ఫోటో అవసరమా?..’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు.

రేషన్‌కార్డులపై సీఎం ఫొటో అవసరమా?

  • నెలకు 5 కిలోల బియ్యం ఇచ్చే ప్రధాని ఫొటో ఏదీ?: ఈటల

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్‌కార్డులపై ‘సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల ఫోటో అవసరమా?..’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యం మాత్రమే ఇస్తూ కార్డులపై ఫొటోలు ముద్రించుకుంటోందని, నెలకు ఐదు కిలోల బియ్యం ఇస్తున్న ప్రధాని మోదీ ఫోటో మాత్రం ఎక్కడా లేదని విమర్శించారు. ‘ప్రభుత్వం మారితే కొత్త కార్డుల ప్రింటింగ్‌ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా?’ అని నిలదీశారు. శుక్రవారం, సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజును కలిసి మల్కాజ్‌గిరి పరిధిలోని పలు పెండింగ్‌ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఇక్కడ పలు చోట్ల ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసీ ఇవ్వడంలో ఆలస్యం చేస్తోందని ఈటల ఆరోపించారు. నగరంలో రైల్వే ేస్టషన్ల ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రపంచ వేదికల మీద రాహుల్‌ గాంధీ దేశం మీద విషం చిమ్ముతున్నారని, సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యతిరేక శక్తులను కలిేసందుకు వెళ్తున్నారన్న సమాచారంతోనే ఆయన అమెరికా టూర్‌కి అనుమతి ఇవ్వలేదని ఈటల స్పష్టం చేశారు.

Updated Date - Aug 29 , 2026 | 04:06 AM