Share News

గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాథోడ్‌ ప్రకాష్‌

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:02 AM

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గిరిజన విద్యా విభాగం గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాథోడ్‌ ప్రకాష్‌ ఎంపికయ్యారు.

గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాథోడ్‌ ప్రకాష్‌

ఇంద్రవెల్లి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గిరిజన విద్యా విభాగం గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాథోడ్‌ ప్రకాష్‌ ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇరుప సారయ్య(వరంగల్‌), రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రేమ్‌ సింగ్‌ జాదవ్‌(ఆదిలాబాద్‌), రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భద్రు నాయక్‌(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఎన్నికయ్యారు.

Updated Date - Jun 14 , 2026 | 04:02 AM