Share News

kumaram bheem asifabad- గోపెంచికల్‌పేట్‌లో అరుదైన టస్సార్‌ సిల్క్‌ మాత్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 10:23 PM

): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ అటవీ ప్రాంతంలో అరుదైన టస్కార్‌ సిల్క్‌ మాత్‌ కనిపించింది. చూడడానికి సీతాకోక చిలుకను పోలిన ఈ జీవికి పర్యావరణ పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని అటవీ అధికారులు అంటున్నారు. అంతర్జాతీయ వస్త్ర మార్కెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సహజసిద్ద వన్య పట్టు(టస్కార్‌ సిల్క్‌) ఉత్పత్తికి మూలమైన అరుదైన టస్కార్‌ సిల్క్‌ మాత్‌ మండలంలోని అగర్‌గూడ గ్రామంలో సామల రాజన్న ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతూ కనిపించింది. లేత గులాబీ, బంగారు గోధుమ వర్ణాల మేళవింపుతో సుమారు 15 సెంటిమీటర్ల విస్తీర్ణంతో రెక్కలు ఉన్న ఈ జీవి రూపం స్థానికులను పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ప్రకృతి సిద్ధంగానే ఈ ప్రాణికి ఒక అద్బుతమైన ఆత్మరక్షణ ఆయుధం ఉంది.

kumaram bheem asifabad- గోపెంచికల్‌పేట్‌లో అరుదైన టస్సార్‌ సిల్క్‌ మాత్‌
టస్కార్‌ సిల్క్‌ మాత్‌ పెంచికల్‌పేట్‌లో కనిపించిన టస్కార్‌ సిల్క్‌ మాత్‌

పెంచికల్‌పేట్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ అటవీ ప్రాంతంలో అరుదైన టస్కార్‌ సిల్క్‌ మాత్‌ కనిపించింది. చూడడానికి సీతాకోక చిలుకను పోలిన ఈ జీవికి పర్యావరణ పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని అటవీ అధికారులు అంటున్నారు. అంతర్జాతీయ వస్త్ర మార్కెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సహజసిద్ద వన్య పట్టు(టస్కార్‌ సిల్క్‌) ఉత్పత్తికి మూలమైన అరుదైన టస్కార్‌ సిల్క్‌ మాత్‌ మండలంలోని అగర్‌గూడ గ్రామంలో సామల రాజన్న ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతూ కనిపించింది. లేత గులాబీ, బంగారు గోధుమ వర్ణాల మేళవింపుతో సుమారు 15 సెంటిమీటర్ల విస్తీర్ణంతో రెక్కలు ఉన్న ఈ జీవి రూపం స్థానికులను పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ప్రకృతి సిద్ధంగానే ఈ ప్రాణికి ఒక అద్బుతమైన ఆత్మరక్షణ ఆయుధం ఉంది. దీని రెక్కల పై భాగంలో మెరిసే పారదర్శకమైన గుండ్రటి చుక్కలు ఉంటాయి. శత్రువులైన పక్షులు లేదా ఇతర వన్యప్రాణులు దాడి చేయటానికి వచ్చినప్పుడు ఇవి పెద్ద జంతువుల కళ్లలా భ్రమింపజేసి వాటిని భయపెట్టేందుకు రక్షణ కవచంగా తోడ్పడుతాయి. ఈ అరుదైన జీవి జీవిత చక్రంలో అత్యంత ఆశ్చర్యకమైన నిజం ఎమిటంటే గూడ(కోశస్త దశ) నుంచి పూర్తి స్థాయి రెక్కల చిమ్మట రూపంలోకి ఇది మారిన తర్వాత దీనికి ఆహారం తినటానికి నోటి భాగాలే ఉండవు. గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు తిని ఒంట్లో దాచుకున్న శక్తితోనే ఇది ఒకటి నుంచి రెండు వారాల పాటు కేవలం ఆహారం ముట్టకుండా జీవిస్తుంది. ఈ స్వల్ప కాలంలోనే తన వంశాన్ని నిలబెట్టే సంతానోప్పత్తి ప్రక్రియను పూర్తి చేసి కన్నుమూస్తుంది. పర్యావరణపరంగా ఈ జీవుల ఉనికికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. కాలుష్యం లేని, జీవ వైవిధ్యం సమృద్ధిగా ఉన్న దట్టమైన అరణ్యాల్లో మాత్రమే ఇది స్వేచ్ఛగా పెరుగుతాయి. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో అనిల్‌ కుమార్‌ను వివరణ కోరగా పెంచికల్‌పేట్‌ అడవుల్లో ఈ అరుదైన మాత్‌ కనిపించడం విశేషమని చెప్పారు. ఇక్కడి అటవీ ప్రాంతం కాలుష్య రహితంగా ఉందనడానికి దీని ఉనికి నిదర్శనమన్నారు. చూడడానికి పెద్ద సీతాకోక చిలుకలా కన్పిస్తోందని ఆయన తెలిపారు.

Updated Date - Oct 23 , 2026 | 10:23 PM