Share News

కల్వకుర్తి రూరల్‌ మండలానికి అరుదైన గుర్తింపు

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:19 PM

సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్ర క్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారా ల డిజిటలైజేషన్‌ చేయడంలో కల్వకుర్తి రూరల్‌ మండలం వందశాతం లక్ష్యం చేరుకుం ది.

కల్వకుర్తి రూరల్‌ మండలానికి అరుదైన  గుర్తింపు
డిజిటలైజేషన్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఇబ్రహీం

- రంగారెడ్డి జిల్లాలోనే 100శాతం ఓటరు జాబితా డిజిటలైజేషన్‌ పూర్తి చేసిన తొలి మండలం

- తహసీల్దార్‌ ఇబ్రహీం

కల్వకుర్తి, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్ర క్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారా ల డిజిటలైజేషన్‌ చేయడంలో కల్వకుర్తి రూరల్‌ మండలం వందశాతం లక్ష్యం చేరుకుం ది. విశిష్ట ఘనతను నమోదు చేసింది. రంగా రెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గ పరిధిలో 100 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన తొలి మండలంగా కల్వకుర్తి రూరల్‌ నిలిచిందని తహసీల్దార్‌ ఇబ్రహీం తెలిపారు. భారత ఎన్నిక ల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితా డిజిటలైజేషన్‌ను అత్యంత పా రదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేశామని చె ప్పారు. ప్రతీ ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎలాంటి లోపాలకు తావు లేకుండా కార్యాచరణ చేపట్టడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయ డం వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రశంసించారు. అందరికీ తహసీల్దార్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 29 , 2026 | 11:19 PM