Share News

అరుదైన సీతాకోక చిలుక

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:21 AM

అరుదైన ఇండియన్‌ మూన్‌మోత్‌ (సీతాకోక చిలుక)ను ఇటీవల నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ నల్లమల అభయారణ్యంలో గుర్తించినట్లు ...

అరుదైన సీతాకోక చిలుక

బ్రహ్మగిరి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : అరుదైన ఇండియన్‌ మూన్‌మోత్‌ (సీతాకోక చిలుక)ను ఇటీవల నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ నల్లమల అభయారణ్యంలో గుర్తించినట్లు హైటీకాస్‌ సంస్థ ప్రతినిధులు గజ్జల బాపురెడ్డి, అఖిల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మూన్‌మోత్‌.. సీతాకోక చిలుక జాతికి చెందిన కీటకం. ప్రధానంగా రాత్రివేళల్లో చురుకుగా ఉండి, కృత్రిమ వెలుతురుకు ఆకర్షితమవుతుంది. ఆకుపచ్చ రంగులో రెక్కలు, పొడవైన తోకలతో ప్రత్యేకంగా కనిపిస్తుందని తెలిపారు. ఇవి సాధారణంగా ఆరోగ్యకరమైన అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపించడం వల్ల.. దీని ఉనికి అడవుల జీవవైవిధ్య సమృద్ధికి సంకేతంగా పరిగణిస్తారన్నారు. దీని జీవన చక్రంలోని గొంగళిపురుగు దశలో వివిధ రకాల మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటుందని, వయోజన దశలో కేవలం 5-8 రోజులు జీవించి ప్రఽ దానంగా సంతానోత్పత్తిపైనే దృష్టిపెడుతుందన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 04:21 AM