Share News

పైకప్పు పెచ్చులూడి.. మహిళకు గాయాలు

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:49 AM

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మునిసిపాలిటీ ముర్తోజుపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

పైకప్పు పెచ్చులూడి.. మహిళకు గాయాలు

ఆమనగల్లు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మునిసిపాలిటీ ముర్తోజుపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ముర్తోజుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి గ్రామానికి చెందిన కర్నాటి లక్ష్మమ్మ ఓటేసేందుకు వచ్చారు. ఆమె పోలింగ్‌ బూత్‌లోకి వెళుతుండగా పాఠశాల వరండా పైకప్పు పెచ్చులూడి ఆమె తలపై పడ్డాయి. దీంతో లక్ష్మమ్మ తలకు తీవ్ర గాయమవ్వగా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. తలకు గాయమైనప్పటికీ లక్ష్మమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 02:49 AM