Share News

రంగ్‌ బర్‌సే

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:17 PM

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వీధి వీధినా రంగుల మయంగా మారి పోయింది. జిల్లా వ్యాప్తంగా రంగుల పండుగను ఘనం గా నిర్వహించుకున్నారు. చిన్నారులు, పెద్దలు యువతి యువకులు రకరకాల రంగులు చల్లుకుంటూ హోలీ శు భాకాంక్షలు తెలుపుకున్నారు.

రంగ్‌ బర్‌సే

అంబరాన్నంటిన హోలీ సంబురాలు

మంచిర్యాల కలెక్టరేట్‌ మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వీధి వీధినా రంగుల మయంగా మారి పోయింది. జిల్లా వ్యాప్తంగా రంగుల పండుగను ఘనం గా నిర్వహించుకున్నారు. చిన్నారులు, పెద్దలు యువతి యువకులు రకరకాల రంగులు చల్లుకుంటూ హోలీ శు భాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు తెల్లవా రుజామున కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల్లో హోలీ పండుగను పురస్కరించుకొని ప్రత్యే క పూజలు నిర్వహించారు. మంగళవారం చంద్రగ్ర హ ణం ఉండటంతో మధ్యాహ్నం 1 గంటలోపే వేడుకలు నిర్వహించుకున్నారు. నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సా హంగా గడిపారు. వేడుకల నేపథ్యంలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

డిగ్రీ కళాశాలల మైదానంలో...

జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో వా కర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో హోలీ పండుగను ఘనంగా ని ర్వహించారు. శుభాకాంక్షలు తెలిపుకుకున్నారు.

మంచిర్యాలక్రైం: పాత మంచిర్యాల 14వ డివిజన్‌ లో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు తూముల నరేశ్‌ ఆధ్వ ర్యంలో ఘనంగా హోలీ సంబురాలు నిర్వహించారు. పాత మంచిర్యాల చౌరస్తాలో డీజేతో సందడి చేస్తూ ఆ టపాటలతో కేరింతలు వేస్తూ సంబురాలు జరుపుకు న్నారు. హోలీ సందర్భంగా యువకులతో పాటు మహి ళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణం పలు డివిజిన్లలో కార్పొరేటర్లతో పాటు మహిళలు కార్య కర్తలు, ఉత్సాహంతో సంబురాలు నిర్వహించుకున్నారు.

దండేపల్లి: మండలంలోని గిరిజన గూడాలలో గిరిజనులు వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దాతేడా లేకుండా అందరూ కలిసి రం గులు చల్లుకుంటూ వీధుల గూండా తిరుగుతూ రంగు లు పూసుకున్నారు.

హాజీపూర్‌ : మండలంలో హోలీ సంబరాలు మంగ ళవారం ఘనంగా జరిగాయి. ఉదయం చిన్నారులు, యువకులు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లు కుంటూ ఉత్సాహంగా గడిపారు.

లక్షెట్టిపేట: పట్టణంతో పాటు మండలంలోని అ న్ని గ్రామాల్లో హోలీ వేడుకని మహిళలు, యువకు లు, చిన్నారులు, అధికారులు అందరూ ఘనంగా జ రుపుకున్నారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో సిబ్బంది సీఐ రమణమూర్తి, ఎస్సై, గోపతి సురేష్‌, తహసీయోద్దీన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం సమీ పంలోని గోదాదరికి చేరుకుని స్నానాలు ఆచరించారు. సీఐ ఎస్సై పరిసరాల్లో పహార నిర్వహించారు.

నస్పూర్‌ : నస్పూర్‌లో హోలీ వేడుకలు మంగళవా రం ఘనంగా జరిగాయి. ఒకరిపై ఒక్కరూ సహజ సి ద్ధమైన రంగులు చల్లుకుంటూ హోళి శుభాకాంక్షలు తె లుపుకున్నారు. ఆయా కాలనీల్లో చిన్నారుల నుంచి పె ద్దల వరకు హోలీ సంబరాల్లో పాల్గొని రంగులు చ ల్లుకుంటూ ఆనందోత్సవాల మద్య హోలీని జరుపుకు న్నారు. హోలి వేడుకలు ముగిసి అనంతరం పలువురు సీతారాంపల్లి గోదావరి నదిలో స్నానాలు చేశారు.

చెన్నూరు : చెన్నూరు పట్టణంలో చిన్నారులు, యు వకులు, మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుం టూ ఉత్సాహంగా గడిపారు. చెన్నూరులోని స్థానిక బా లుర ఉన్నత పాఠశాల మైదానం, అంబేద్కర్‌ చౌక్‌లో వాకర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సహజ రంగులతో వేడుకలు నిర్వహించుకుని రంగులు పూసుకున్నారు.

బెల్లంపల్లి : పట్టణంలో మహిళలు యువకులు, చిన్నారులు, నాయకులు రంగులు చల్లుకుంటూ నృత్యా లు చేశారు. హోలీ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దావ స్వాతిరమేష్‌ల తో పాటు కాంగ్రెస్‌ నాయకులు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

కాసిపేట : హోలీ వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించుకున్నారు. సోమవా రం రాత్రి జరిగిన కామ దహనం అనంతరం మంగళవారం హోలీ వేడుకలను నిర్వ హించారు. యువతీ, యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉ త్సాహంగా గడిపారు. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.

భీమిని : మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళ వారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వయ స్సుతో సంబందం లేకుండా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వ రకు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్సై విజయ్‌కు మా ర్‌ చిన్నారులతో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మండలం కేంద్రంలో సర్పంచ్‌ బండి శ్రీకాంత్‌గౌడ్‌ యువకులతో కలిసి హోలీ వేడుకలు నిర్వహించారు.

మందమర్రిటౌన్‌: పట్టణంలో మంగళవారం హో లీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణం లోని 3వ జోన్‌, ప్రాణహిత కాలనీ, అంగ డిబజార్‌, మార్కెట్‌ ఏరియాలో గుంపులుగా కాలనీల్లో మహిళ లంతా రంగులు జల్లుకున్నారు. 2వ జోన్‌లో నల్లాల ఓదెలు నివాసం వద్ద ఆయన మిత్రులతో పాత్రికేయు లకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ రమేశ్‌, ఎస్‌ఐ నరేశ్‌ ఆధర్యం లో సిబ్బంది రంగులు జల్లుకొని శుభాకాంక్షలు తెలుపు కున్నారు. కేకే 2 బంగ్లాస్‌ ఏరియాలో జీఎం రాధాక్రిష్ణ కుటుంబ సభ్యులతో హోలీ సంబురాలు జరుపుకున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:17 PM