Share News

వీధి కుక్కల స్వైర వివారం..

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:18 PM

వీధి కుక్కల నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికి త్సలు నిర్వహించడం ద్వారా వాటి జాతి వ్యాప్తికి అడ్డు కట్ట వేసేందుకు చర్యలు చేపట్టవలసి ఉండగా, అధికా రుల నిర్లక్ష్యం మూలంగా అది లక్ష్యం దిశగా పయనిం చడం లేదు.

వీధి కుక్కల స్వైర వివారం..

-లక్ష్యం మేరకు జరగని శస్త్ర చికిత్సలు

-మూతపడ్డ ప్రత్యేక ఆస్పత్రి భవనం

-రూ.35 లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రత్యేక భవనం

మంచిర్యాల, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికి త్సలు నిర్వహించడం ద్వారా వాటి జాతి వ్యాప్తికి అడ్డు కట్ట వేసేందుకు చర్యలు చేపట్టవలసి ఉండగా, అధికా రుల నిర్లక్ష్యం మూలంగా అది లక్ష్యం దిశగా పయనిం చడం లేదు. ఇటీవల వీధి కుక్కలు స్వైర విహారం చే స్తూ మనుషులపై దాడి చేస్తున్న సంఘటనలు కోకొల్ల లుగా ఉన్నాయి. కిందటి సంవత్సరం మందమర్రి మం డలంలో 15 మందిపై వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. జిల్లా కేంధ్రంలోని చున్నంబట్టి ప్రాం తంలో తాళ్లపెల్లి ప్రసాద్‌ అనే వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్క ఆయన ఎడమ చేతి వేలును కొరికి ఎత్తికె ళ్లింది. అంతటితో ఆగకుండా సమీపంలోని బృందావ నం కాలనీలో పెయింటింగ్‌ పనులు చేస్తున్న నలుగు రు కూలీలపై దాడికి తెగబడింది. నాలుగు రోజుల క్రి తం మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలో అప్పాసు సత్యనారాయణకు చెందిన రెండు లేగదూడలపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చా యి. గతంలో వీధి కుక్కల ఆగడాలు ఎక్కువైనపుడల్లా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో విషపూరితమైన ఇంజక్షన్లు ఇచ్చి వాటిని హతమార్చేవారు. అలా వాటి బెడదను తొలగించేవారు. అయితే ప్రముఖ రాజకీయవేత్త మేన కాగాంధీ అధ్యక్షతన కొనసాగుతున్న పేటా (పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌) చట్టానికి కేంద్ర ప్రభుత్వం మరింతగా పదును పెట్టడంతో కుక్క లను వధిండం నేరంగా పరిగణిస్తున్నారు. దీంతో కొ న్నాళ్లుగా కుక్కలపై విష ప్రయోగం చేయడాన్ని నిలిపివేశారు.

కుని శస్త్రచికిత్స ద్వారా నిర్మూలన....

కుక్కలను చంపడం చట్టవిరుద్దమైనప్పటికీ వాటి వల్ల మనుషుల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ప్రభు త్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఆడ, మగ కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికి త్సలు చేయడం ద్వారా వాటి జాతి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ చేపట్టారు. వీధుల్లో సంచరించే కుక్కలను పట్టుకొని వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్ల మధ్య శస్త్రచికిత్సలు చేసి సంతానోత్పత్తి కలగకుండా చర్యలు చేపట్టవలసి ఉంది. కాలక్రమంలో వీధి కుక్కలను ని ర్మూలించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టవలసి ఉండగా, ఆ ప్రక్రియ లక్ష్యం దిశగా పయనించడం లేదు.

జిల్లాలో 10వేల పైచిలుకు గుర్తింపు...

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పదివేల పై చిలుకు వీధి కుక్కలను అధికా రులు గుర్తించినట్లు తెలుస్తోంది. ముందుగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో సంచరిస్తున్న కుక్కలకు శస్త్రచికిత్సలు చేసిన అనంతరం గ్రామ పంచాయతీల పరిధిలోని కుక్కలకు కూడా కుటుంబ నియంత్రణ ఆ పరేషన్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని వార్డులను ఎంపిక చేసుకుని వాటికి ఆపరేషన్లు చేసిన అనంతరం వారం రోజులపాటు వాటిని పరిశీలించి, వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టడం ద్వారా ఆహార కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ని ర్ణయించారు. అలాగే కోతులకు కూడా పై విధమైన ట్రీ ట్‌మెంట్‌ అందజేయడం ద్వారా వాటి వ్యాప్తిని కూడా నిర్మూలించాలని తలపెట్టారు.

రూ. 35 లక్షలతో ప్రత్యేక ఆసుపత్రి....

కుక్కలకు, కోతులకు శస్త్ర చికిత్సలు జరిపేందుకు జిల్లా కేంధ్రంలోని ఆండాళమ్మ కాలనీ సమీపంలో యా నిమల్‌ కేర్‌ సెంటర్‌ పేరుతో రూ. 35 లక్షల మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌తో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. అందు లో కొంతకాలంపాటు శస్త్ర చికిత్సలు జరిగినప్పటికీ కొద్ది నెలలుగా అవి మరుగున పడ్డాయి. దీంతో ప్రత్యేక ఆసుపత్రి భవనం అలంకార ప్రాయంగా మారింది. భ వనంలో ప్రత్యేక వైద్యుని నియామకంతోపాటు ఆప రేషన్‌ థియేటర్‌, డ్రెస్సింగ్‌ రూం, స్టాఫ్‌ రూం, మం దుల గది, షెడ్డును ఏర్పాటు చేసినప్పటికీ లక్ష్యం నెరవేరడం లేదు.

నిలిచిన కుని ఆపరేషన్లు...

ప్రత్యేక ఆస్పత్రిలో ప్రస్తుతం శునకాలకు కుటంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. శస్త్ర చికిత్సలు నిలిచిపోయిన కారణంగా వీధి కుక్కల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. జిల్లాలో 10వేలకు పైగా వీధి కుక్కలు ఉండగా, వాటికి కుని ఆపరేషన్లు ఎప్పు డు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నా యి. ప్రత్యేక ఆసుపత్రిలో ఆది నుంచి అపవాదులే చో టు చేసుకుంటున్నాయి. ఏడాది క్రితం ఆపరేషన్‌ కోసం వివిధ ప్రాంతాల నుంచి భవనానికి తీసుకొచ్చిన శున కాలలో ఆరు మృత్యువాత పడ్డాయి. ఆపరేషన్‌కు ముం దు, తరువాత మొత్తంగా పది రోజులపాటు శునకాల ఆలనా, పాలనా చేపట్టవలసి ఉంది. అయితే రోజుల త రబడి వాటికి తిండి పెట్టకపోవడంతో ఆకలితో అలమ టించి మృతి చెందాయి. అప్పట్లో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పలాయనం చిత్తగించగా, అందులో పని చేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడంతో వారంతా పని మానేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆసుపత్రి భవనానికి తాళం వేలాడుతుండగా, అధికారులు ధృష్టి సారించకపోవడంతో కుటుంబ నియంత్రణ ఆపరేష న్లకు గ్రహణం పట్టినట్లయింది.

Updated Date - Jun 17 , 2026 | 11:18 PM