Share News

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌)గా.. రమేశ్‌ బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:56 AM

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌)గా ఓలేటి వెంకట రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌)గా.. రమేశ్‌ బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌)గా ఓలేటి వెంకట రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సూర్యాపేట, ఖమ్మం చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ)గా పనిచేస్తున్న ఆయన.. ఈఎన్‌సీ(అడ్మిన్‌)గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈఎన్‌సీ(జనరల్‌)గా పనిచేస్తున్న మహమ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ గత జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేశారు. ఈఎన్‌సీ(జనరల్‌) పోస్టు ఖాళీగా ఉంచడం సముచితం కాదని భావించిన ప్రభుత్వం.. రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Feb 07 , 2026 | 04:56 AM