Share News

రమణ మహర్షి భక్తురాలు బాలసరస్వతి కన్నుమూత

ABN , Publish Date - May 18 , 2026 | 03:27 AM

భగవాన్‌ శ్రీ రమణ మహర్షి భక్తురాలు మద్దాళి బాల సరస్వతి తన 96వ ఏట శనివారం సాయంత్రం కన్నుమూశారు. రమణ మహర్షి ఒడిలో..

రమణ మహర్షి భక్తురాలు బాలసరస్వతి కన్నుమూత

చిక్కడపల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): భగవాన్‌ శ్రీ రమణ మహర్షి భక్తురాలు మద్దాళి బాల సరస్వతి తన 96వ ఏట శనివారం సాయంత్రం కన్నుమూశారు. రమణ మహర్షి ఒడిలో తన బాల్యాన్ని గడిపిన ధన్యజీవి ఆమె. మద్దాళి సుబ్బారావుతో ఆమె వివాహం జరిపించింది కూడా భగవానే. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలోని ఆమె స్వగృహంలో పలువురు ప్రముఖులు, రమణాశ్రమ సభ్యులు, భక్తులు, బంధుమిత్రులు నివాళులర్పించారు. ఆదివారం ఉదయం తార్నాక హిందూ స్మశానవాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - May 18 , 2026 | 03:27 AM