Share News

kumaram bheem asifabad- భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:28 PM

నెలవకం దర్శనమివ్వడంతో జిల్లా వ్యాప్తంగా శనివారం రంజాన్‌ సందర్భంగా ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్‌ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్‌ రోజు ముగించడం అనవాయితీ. రంజాన్‌ సందర్భంగా ముస్లిలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

kumaram bheem asifabad- భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు
ఆసిఫాబాద్‌లో శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- ముస్లింలకు పలువురు నాయకుల శుభాకాంక్షలు

ఆసిఫాబాద్‌రూరల్‌/కాగజ్‌నగర్‌/బెజ్జూరు/చింతలమానేపల్లి/రెబ్బెన/దహెగాం/వాంకిడి/కెరమెరి/పెంచికలపేట/సిర్పూర్‌(టి)/జైనూర్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): నెలవకం దర్శనమివ్వడంతో జిల్లా వ్యాప్తంగా శనివారం రంజాన్‌ సందర్భంగా ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్‌ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్‌ రోజు ముగించడం అనవాయితీ. రంజాన్‌ సందర్భంగా ముస్లిలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకన్న, సలాం, అబ్దుల్లా, కార్తీక్‌, నాయకులు రహెమాన్‌, సరస్వతీ, రవీందర్‌, నిసార్‌, వెంకన్న, మల్లేష్‌, ఖలీమ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్‌ ఆధ్వర్యంలో సీఐ బాలాజీ వరప్రసాద్‌, ఎస్సై, కానిస్టేబుళ్లు బందో బస్తు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఈద్గా వద్ద మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. బెజ్జూరు మండల కేంద్రంతో పాటు ఎల్కపల్లి, కుకుడ, మర్తిడి తదితర గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లిలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు బాబాసాగర్‌, గూడెం, రన్‌వెల్లి, తదితర గ్రామాల్లో ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలిపారు. రెబ్బెన మండలం కేంద్రంతో పాటు గోలేటి టౌన్‌ షిప్‌లో ముస్లిలు రంజాన్‌ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు. దహెగాం మండల కేంద్రంతో పాటు బీబ్రా, గొర్రెగుట్ట గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వాంకిడి మండలంలో రంజాన్‌ను ముస్లింలు ఘనంగా జరుపకున్నారు. బంబార ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కెరమెరి మండల కేంద్రంతో పాటు ఝరి, ధనోర, సుర్దాపూర్‌ గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ పండుగ నిర్వహించారు. సుల్తాన్‌గూడలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెంచికలపేట మండలంలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎస్సై అనీల్‌కుమార్‌, తదితరులు ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. జైనూర్‌ మండలంలో రంజాన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయమే పెద్ద సంఖ్యలో ముస్లింలు స్థానిక ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద స్థానిక సర్పంచ్‌ కొడప ప్రకాష్‌ ప్రార్థన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్కెట్‌ కమిటీ చెర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, మాజీ సహకార చైర్మన్‌ కొడప హన్ను పటేల్‌, సర్పంచ్‌ కొడప ప్రకాష్‌, ఉప సర్పంచ్‌ డోంగ్రే ప్రకాష్‌, సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీరావ్‌, ఎగ్జీక్యూటీవ్‌ మెంబరు పెందుర్‌ ప్రకాష్‌, పవన్‌కుమార్‌ ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 11:28 PM