Share News

ప్రేమానురాగాలకు ప్రతీక రంజాన్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 10:31 PM

ప్రేమానురాగాలకు ప్రతీక రంజాన్‌ పండగ అని ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. శనివారం రంజాన్‌ పండగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ని పురా ణ మసీదు ఆవరణలో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యే క ప్రార్థనలు చేశారు.

ప్రేమానురాగాలకు ప్రతీక రంజాన్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : ప్రేమానురాగాలకు ప్రతీక రంజాన్‌ పండగ అని ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. శనివారం రంజాన్‌ పండగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ని పురా ణ మసీదు ఆవరణలో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యే క ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మసీ దుల వద్దకు వెళ్లి ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం మత పెద్దలు సయ్యద్‌ హబీబ్‌, ఇబ్రహీం ఖాద్రిలు మాట్లాడుతూ రంజాన్‌ పర్వదినం సందర్భం గా జిల్లా ప్రజలందరు సంతోషంగా, ఐక్యతతో ఉండా లని, మతసామరస్యానికి ప్రతీకగా అందరు ఉం డాల న్నారు. పేదలకు సహాయం చేస్తూ వారి పట్ల ప్రేమతో ఉండాలన్నారు. మసీదుల కమిటీ నాయ కులు, పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: ముస్లింలకు అత్యంత పవిత్ర మైన పండగ రంజాన్‌ను పట్టణంలో ఘనంగా జరుపు కున్నారు. ఉదయం మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన లు చేశారు. ఒకరికి ఒకరు పండగ శుభాకాంక్షలు తె లుపుకున్నారు. సింగరేణి పాఠశాల సమీపంలోని ఈ ద్గా వద్ద, రైల్వేస్టేషన్‌ వద్ద గల ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. రాష్ట్ర కార్మిక, ఉ పాధి కల్పన, గనుల శాఖ మంత్రి ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లింలకు పం డగ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ప్రార్ధనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్‌ అని పే ర్కొన్నారు. తమ ప్రభుత్వం ముస్లిం ల సంక్షేమానికి కట్టుబడి పని చే స్తుందన్నారు. మందమర్రి సీఐ రమే ష్‌, ఎస్‌ఐ నరేష్‌ల ఆధ్వర్యంలో పోలీ సులు బందోబస్తు నిర్వహించారు. మతపెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 10:31 PM