Lift Irrigation Scheme: రామప్ప నుంచి పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:51 AM
ములుగు జిల్లా వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించనున్నది. జిల్లా కేంద్రమైన ములుగు మండల పరిధిలోని 6 గ్రామాల చెరువులను నింపేందుకు రామప్ప చెరు వు నుంచి పొట్లాపూర్ ...
నేటి క్యాబినెట్ భేటీలో ములుగు ప్రజలకు తీపి కబురు?
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించనున్నది. జిల్లా కేంద్రమైన ములుగు మండల పరిధిలోని 6 గ్రామాల చెరువులను నింపేందుకు రామప్ప చెరు వు నుంచి పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మేడారంలో ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలుపనున్నది. ఈ పథకం ద్వారా మదనపల్లి, జగ్గన్నపేట్, అన్నంపల్లి, పొట్లాపూర్, జంగాలపల్లి గ్రామాల్లోని 6,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని రూ.103.22 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయనున్నది. ఇంటేక్ వెల్, ఇంటేక్ పైపులైన్, జాక్‌వెల్‌తోపాటు పంప్‌హౌస్ నిర్మిస్తారు. ఇదిలా ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మేడారంలో జరిగే క్యాబినెట్‌లో చ ర్చించి.. పరిష్కార మార్గం కనుగొనాలని ప్రభుత్వాన్ని టీజీఎ్‌సఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కన్వీనర్ మౌలానా కోరారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జాతరలో కార్మికులు సంతోషంగా విధులు నిర్వహించేందుకు వీలుగా తీపి కబురు చెప్పాలని కోరారు.