రామ్‌చరణ్ దంపతులకు కవలలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:06 AM
మెగా కుటుంబంలో సంతోషం నిండింది. సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు.
పాప, బాబుకు జన్మనిచ్చిన ఉపాసన
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మెగా కుటుంబంలో సంతోషం నిండింది. సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఉపాసన ఒక పాప, బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రామ్‌చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే రామ్‌చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న విషయం తెలిసిందే. కాగా, రామ్‌చరణ్‌కు కవల పిల్లలు జన్మించారన్న వార్త తెలిసిన మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.