Share News

kumaram bheem asifabad- రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - May 21 , 2026 | 10:10 PM

దేశాభివృద్ధికి రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి ఆత్రం సుగణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

kumaram bheem asifabad- రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు సుగుణ

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి ఆత్రం సుగణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ దేశాబివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ క్యాక్రమంలో నియోజక వర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, గ్రంథాలయ చైర్మన్‌ అనీల్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, నాయకులు తారీక్‌, భీంరావు, మల్లేష్‌, ఆసీఫ్‌, బాలేష్‌గౌడ్‌, జక్కన్న, మారుతి, కౌన్సిలర్లు వినోద్‌, కార్తీక్‌, గోవింద్‌, నిఖిల్‌, సాయి, హెచ్‌.సాయి, తిరుపతి, సత్తన్న, జావీద్‌, మురళీ, వాసుదేవ్‌, కాలీం, బాలు, హరీష్‌, ఇమ్రాన్‌, రాము, సోము, శ్రీకాంత్‌, సాయి, తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి,(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని మండలంలో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నారాయణ, మెంగా జీ, నానాజీ, గణేష్‌, అనీల్‌, నాగభూషన్‌, పెంటు, గుండయ్య తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజీవ్‌గాంధీ వర్ధం తిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పీహెచ్‌సీలో రోగులకు నాయకులు పండ్లు పంపీణి చేశారు. అనంతరం వైస్‌ ఎంపీపీ షేక్‌ రషీద్‌ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవులు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, మాజీ వైస్‌ ఎంపీపీలు లక్ష్మణ్‌, డీసీసీ సభ్యులు పెందుర్‌ ప్రకాష్‌, సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీరావ్‌, డాక్టర్‌ షేక్‌, జమీల్‌ తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటా నికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాంచందర్‌, విజయ్‌, గౌరవయ్య, రమేష్‌గౌడ్‌, సురేష్‌, కొముర య్య, సత్యం, ఎల్లయ్య, మంగ, లచ్చన్న, అంజగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 10:10 PM