మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: రాజగోపాల్‌రెడ్డి
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:28 AM
రాబోయే కాలంలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందనే ఆశాభావాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యక్తం చేశారు.
చౌటుప్పల్ టౌన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాబోయే కాలంలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందనే ఆశాభావాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యక్తం చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన మునిసిపల్ చైర్‌పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో నిజాయితీగా పని చేసేవారెవరో అధిష్ఠానానికి తెలుసని పేర్కొన్నారు. తాను ప్రజల కోసమే రాజకీయాలు చేస్తున్నానని.. పదవి అనేది బాధ్యత మాత్రమేనని, కిరీటం కాదని వ్యాఖ్యానించారు. కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేసేవారు కొంతకాలమే మనగలుగుతారని, మానవత్వంతో పనిచేసేవారు ప్రజల్లో చెరగని ముద్ర వేస్తారని చెప్పారు.