Share News

ఇంకెన్నాళ్లు ఇతర రాష్ట్రాల్లో గెలిస్తే సంబరాలు

ABN , Publish Date - May 05 , 2026 | 04:13 AM

ఇతర రాష్ట్రాల్లో గెలుపుతో ఇంకెన్నాళ్లు ఇక్కడ సంబరాలు చేసుకుంటారని బీజేపీ రాష్ట్ర నేతలను ఉద్దేశిస్తూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ...

ఇంకెన్నాళ్లు ఇతర రాష్ట్రాల్లో గెలిస్తే సంబరాలు

  • తెలంగాణలో అధికారమెప్పుడు: ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లో గెలుపుతో ఇంకెన్నాళ్లు ఇక్కడ సంబరాలు చేసుకుంటారని బీజేపీ రాష్ట్ర నేతలను ఉద్దేశిస్తూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోం, పుదుచ్చేరి, బెంగాల్‌లో గెలిచామని చెప్పుకొంటూ కొందరు నేతలు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కానీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఇంకా ఎన్నేళ్లు వేచి చూడాలని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు ఇతర రాష్ట్రాల విజయాలపై సంబరాలు చేసుకుంటారని ప్రశ్నిస్తూ బీజేపీ నేతల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు.

Updated Date - May 05 , 2026 | 04:13 AM