Share News

kumaram bheem asifabad- సమస్యలపై గళం

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:32 PM

మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారి వెంకట్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచ్‌లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలు సమస్యలు తీర్చలేని పరిస్థితి ఉంటుందని, ఇటు అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని అలాంటప్పుడు ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని పలువురు సర్పంచ్‌లు నిలదీశారు.

kumaram bheem asifabad- సమస్యలపై గళం
నిషానిలో వంగిన విద్యుత్‌ స్తంభాల ఫొటోలు చూపుతున్న సర్పంచ్‌ అంబారావు

- మండల సర్వసభ్య సమావేశాలు ఎందుకని నిలదీత

కెరమెరి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారి వెంకట్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచ్‌లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలు సమస్యలు తీర్చలేని పరిస్థితి ఉంటుందని, ఇటు అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని అలాంటప్పుడు ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని పలువురు సర్పంచ్‌లు నిలదీశారు. నిషాని సర్పంచ్‌ అంబారావు మాట్లాడుతూ తమ గ్రామంలో విద్యుత్‌, ఇంటింటికి ఇందిరమ్మ నల్లాలు 50 శాతం పూర్తి రాలేదన్నారు. ఈ విషయంలో అధికారులు దృష్టికి తీసుకపోయిన కూడా కనీసం పట్టించుకోవటం లేదని సభా దృష్టికి తెచ్చారు. మోడి సర్పంచ్‌ ఆత్రం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లో ఐసీడీఎస్‌ పౌష్టికాహారం వివరాలు సూచిక బోర్డులు అందజేయాలన్నారు. కరంజివాడ సర్పంచ్‌ రాథోడ్‌ బలవంత్‌ మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీతో పాటు అనార్‌పల్లితో పాటు కరంజివాడ, తదితర గ్రామాల్లో వ్యవసాయాధికారి పర్యటించటం లేదన్నారు. పరోందలి సర్పంచి పుష్పలత మాట్లాడుతూ అంగన్వాడీ ఖాళీల నోటిఫికేషన్‌ ఎందుకు వెలువరించటం లేదని ఇతర జిల్లాలో అంగన్‌వాడీ ఖాళీల వివరాలు ప్రకటిసు ్తన్నప్పటికీ, మన జిల్లాకు ఎందుకు వివరిచంటం లేదన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులు తమ అభివృద్ధి పనులను వివరించారు. సమావేశంలో ఎంపీడీవో అంజద్‌ పాష, డిప్యూటి తహసిల్దార్‌ సంతోష్‌ కుమార్‌, ఐసీడీఎస్‌ ఏసీడీపీఓ ఉమాఫాతిమా, వైద్యాధికారి డాక్టర్‌ రియాన్‌, పశువైద్యాధికారి డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ అధికారి యుగేందర్‌, ఏపీవో మల్లయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 10:32 PM