kumaram bheem asifabad- ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:44 PM
ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్, సీఈవో దివ్యదేవరాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాజంపేట గ్రామపంచా యతీలో ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పంచాయతీ పరిధిలోని జూబ్లీ మార్కెట్‌లోని చికెన్, మటన్, ఫీస్ మార్కెట్‌లను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్, సీఈవో దివ్యదేవరాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాజంపేట గ్రామపంచా యతీలో ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పంచాయతీ పరిధిలోని జూబ్లీ మార్కెట్‌లోని చికెన్, మటన్, ఫీస్ మార్కెట్‌లను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకునేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ భిక్షపతి, జడ్పీ సీఈఓ లక్ష్మీనారయణ, డీఎల్‌పీఓ ఉమర్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మౌనిక, సర్పంచ్ బుర్స పోచయ్య, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, బిల్ కలెక్టర్ నాగేందర్, వార్డు సభ్యులు గులాం జావీద్, వేణు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడిని నివారించేం దుకు ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ సూచించారు. మండలంలోని కొఠారి, కొత్తగూడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ నీటి బొట్టును కాపాడుకోవాలన్నారు. గ్రామ పంచాయ తీల్లో ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. అధికారులు, నాయకులు సమన్వ యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి గౌడ్, డీఎల్‌పీవో ఉమర్‌షరీఫ్, కార్యదర్శి సతీష్, సర్పంచ్ శాంతబాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.