kumaram bheem asifabad- వర్షపు నీటిని ఒడిసి పట్టాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 10:55 PM
వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో ఇంకేలా కృషి చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయని కలెక్టర్ కె హరిత అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో ఇంకేలా కృషి చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయని కలెక్టర్ కె హరిత అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురువ లేదన్నారు. లోటు వర్షపాతం నమోదు కారణంగా భూమిలోని నీటి మట్టం మరింత కిందికి పోవడంతో భవిష్యత్ తరాల వారు ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుందన్నారు. ఈనేధ్యంలో ప్రతి వర్షపు నీటి బొట్టును ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చూడాలన్నారు. దీని వల్ల భూగర్భ జల మట్టాన్ని పెంపొందించాలని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురువాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకించడంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ రియాజ్‌ఆలీ, మున్సిపల్ ఆర్‌ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధి దశ నుంచి ఉన్నత లక్ష్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ కె హరిత తెలిపారు. ఎస్పీఎం ఆడిటోరియలో శనివారం కేరిర్ మిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెరిర్ గైడెన్స్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ కొలువు సాధించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అన్ని విషయాలపై పట్టు సాధించాలన్నారు. అప్పుడే పోటీ పరీక్షలో రాణించవచ్చన్నారు. డిగ్రీ తర్వాత వచ్చే ఉద్యోగ అవకాశాలపై కూలంకుషంగా వివరించారు. హైదరాబాద్ కేరీర్ మిత్ర ప్రతినిధి, రిటైర్డ్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ తమ సంస్థ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సైట్‌లో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయన్నారు. ఈ అవకాశాలను విదా ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో వంశీ కృష్ణ, విజయ్‌కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహంతో పాటు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.